- Advertisement -
శ్రీశైల మల్లన్న హుండీల లెక్కింపు
Counting of hundis by Srisaila Mallanna
శ్రీశైలం
గురువారం రోజు 24,10,2024 న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.2,58,56,737/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో 26.09.2024 నుండి 23.10.2024 వరకు సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 379 గ్రాముల, 500 మిల్లీగ్రాముల బంగారం, 8 కేజీల, 030 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 1093 – యుఎస్ఏ డాలర్లు, 215 కెనడా డాలర్లు. 20 యుకె పౌండ్‌కు 10 – యూ.ఏ.ఈ. దిర్హమ్స్, 21- మలేషియా రింగిట్స్ 10 మాల్దీవ్స్ రుఫీయాస్, 10- ఈరోస్, 2- సింగపూర్ డాలర్లు, 25 మౌరీటియస్ రూపాయలు దలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమములో ఇంచార్జి కార్యనిర్వహణాధికారి ఇ. ద్రశేఖరరెడ్డి, యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



