ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?

- Advertisement -

ఖమ్మం జిల్లా:నవంబర్ 03:  ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.

వైరా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.

మృతులను బోనకల్ మండలం రాపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన వారీగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

వీరి పెద్దలు పెళ్లికి నిరాకరించడంతోనే ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular