- Advertisement -
ప్రేమజంట ఆత్మహత్య
Couple suicide
గాజువాక
షీలానగర్ లో ప్రేమజంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది, వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ . బినాయక్ క్లేవ్ అపార్ట్మెంట్ తెల్లవారుజామున అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి ప్రేమజంట, ఆత్మహత్య చేసుకుంది. అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుస్మితగా పోలీసులు గుర్తించారు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా, మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆరు నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గరావు వద్దకి అప్పుడప్పుడు అపార్ట్మెంట్ కు వచ్చి మృతురాలు సాయి సుస్మిత వచ్చి వెళ్తునట్టు సమాచారం. పోలీసులు ప్రాధమిక వివరాలు వెల్లడించారు.
మృతులు ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోర్ట్ పగిలిపోవడం పోలీసులు గుర్తించారు. మృతురాలు సాయి సుస్మిత కుటుంబ సభ్యులకి పోలీసులు సమాచారం అందించారు, మృతుడు ఫోన్ లాక్ అవ్వడంతో విచారణ చేపట్టారు. .
- Advertisement -




