Saturday, November 2, 2024

కోవర్టు క్రెడిట్ నాదే

- Advertisement -

కోవర్టు క్రెడిట్ నాదే
సంచలన కామెంట్స్ తో మల్లారెడ్డి
హైదరాబాద్, మే 8
మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఆయన నైజం. మిగతావాళ్లు ఏమనుకున్నా ఆయన పెద్దగా పట్టించుకోరు. మాట్లాడిన ప్రతీ పదం వెనుక ఆయన నవ్వడం చాలామందికి అనుమానాలుంటాయి. నిజంగా అంటున్నారా? లేక కావాలనే అంటున్నారా? లేకపోతే జోష్ నింపాలని భావిస్తారా? ఇలా రకరకాల అనుమానాలు లేకపోలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితేనే ఆయన నోరు విప్పుతారు. మామూలుగా నిత్యం వార్తల్లోకి ఉండేందు కు పరితపిస్తారాయన.అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలామంది నేతలు కారు దిగిపోయారు. మారిన రాజకీయాలకు అనుగుణంగా వెళ్లకుంటే తమకు లైఫ్ ఉండదని భావించి జంప్ అయిపోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సెలర్ల వంతైంది. దాదాపుగా కారు పార్టీ వీకైందని షెడ్‌కి వెళ్లిందని ఆ పార్టీ నేతలే బలంగా చెబుతున్నారు.బీఆర్ఎస్‌లో ముఖ్యనేతల వ్యవహారశైలి వల్లే కారణమని దుమ్మెత్తిపోస్తున్నవాళ్లూ లేకపోలేదు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీఆర్ఎస్ నుంచి చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి తానే పంపించానని ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసేసుకున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌లో ఉంటూ కారు కోసం కష్టపడతారని మనసులోని మాటను బయటపెట్టారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.విచిత్రం ఏంటంటే పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారాయన. మల్లన్న మాటలపై ఆ పార్టీలోని నేతలే రుసరుసలాడుతున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఎవరైనా అందులో ఉంటారా? ఈ లాజిక్‌ను మాజీ మంత్రి ఎలా మరిచిపోయారని అంటున్నారు. ఏదో కార్యకర్తల్లో హుషారు కోసం అలాగని చెప్పి ఉంటారని చెబుతున్నారు.ఇంకా నయం.. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా తానే పంపించానని మల్లారెడ్డి అనలేదని అంటున్నారు పలువురు నేతలు. మొత్తానికి మల్లారెడ్డి వ్యాఖ్యలు విన్నవాళ్లు మాత్రం ఖుషీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో సరదాగా అన్నమాటలు కూడా ఒక్కోసారి మెడకు చుట్టుకుంటాయని పెద్దాయనకు బాగా తెలుసు. కాకపోతే మాటలతో మాయం చేయడం వెన్నతోపెట్టిన విద్య.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్