Sunday, September 8, 2024

కొవిడ్ కొత్త వేరియంట్..

- Advertisement -

కొవిడ్ కొత్త వేరియంట్..
హైదరాబాద్, డిసెంబర్ 18,
కొవిడ్‌ ఇప్పట్లో మనల్ని వదిలేలా కనిపించడం లేదు. ఇక ఈ వైరస్ సోకదు అనుకున్న ప్రతిసారీ ఏదో  వేరియంట్ రూపంలో మరోసారి విచురుకుపడుతోంది. ఈ సారిజేన్.1 వేరియంట్ వణికిస్తోంది. ఇప్పటికే కేరళలో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. గత వేరియంట్స్‌ కన్నా చాలా ప్రమాదకరమైందని సైంటిస్ట్‌లు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. తిరువనంతపురంలో ఓ వ్యక్తికి RT-PCR టెస్ట్ చేయగా..ఈ వేరియంట్ బయటపడింది. డిసెంబర్ 8వ ఈ విషయం వెల్లడైంది. 79 ఏళ్ల మహిళకు ఫ్లూ లక్షణాలు కనిపించగా టెస్ట్ చేశారు. కొవిడ్‌ నుంచి రికవరీ అయినప్పటికీ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆందోళన పెంచుతోంది. ఈ వేరియంట్‌తో కేసులు కూడా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్  BA.2.86 (Pirola) నే జేన్.1 Variantగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ అమెరికాలో తొలిసారి ఈ వేరియంట్ కేసు నమోదైంది. డిసెంబర్ 15న కూడా చైనాలో ఇదే వేరియంట్‌ 7 కేసులు నమోదయ్యాయి. స్పైక్ ప్రోటీన్‌లో తప్ప BA.2.86, జేన్.1 వేరియంట్స్‌కి పెద్దగా తేడా కనిపించడం లేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వేరియంట్ వైరస్‌ ఉపరితలంపై ఉండే Spike Protein వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతోంది. స్పైక్‌ ప్రోటీన్‌ని కట్టడి చేసే వ్యాక్సిన్‌లు అన్నీ ఈ జేన్.1 వేరియంట్‌పై కచ్చితంగా పని చేయాలని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఈ వేరియంట్‌పై అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే కేసులు మరింత పెరిగే ప్రమాదముందని వార్నింగ్ ఇచ్చారు. ఆందోళన పక్కన పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి ఈ వేరియంట్ లక్షణాలు. ఇప్పటి వరకూ ఈ వైరస్ సోకిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపించాయి. కొంత మంది బాధితుల్లో శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. నాలుగైదు రోజుల పాటు ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైతే…వీలైనంత ఎక్కువగా టెస్ట్‌లు చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. అది కొవిడ్‌ వైరస్సా కాదా అని తెలుసుకోడానికై పరీక్షలు చేయాల్సిన అవసరముందని చెబుతున్నారు. మిగతా వైరల్ ఇన్‌ఫెక్షన్లలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తుండడమే ఇందుకు కారణం. అలా అని కొత్త వేవ్ వచ్చేస్తోందని భయపడాల్సిన పని లేదని అంటున్నారు వైద్యులు. మిగతా వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌లానే వచ్చి వెళ్లిపోతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరిస్తున్నారు. అందుకే నిఘా పెంచాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, వీలైనంత వరకూ భౌతిక దూరం పాటించడం, టెస్ట్‌లు చేయించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా వెంటనే ఐసోలేట్ అవ్వాలి. ఇప్పటికే పలు వేరియంట్‌లు ప్రపంచాన్ని వణికించాయి. ఇప్పుడు మరో వేరియంట్ గుబులు పెంచుతోంది. ఇకపై ఇంకెన్ని వేరియంట్‌లు వస్తాయో స్పష్టత లేదు. కానీ ఎప్పుడైనా వైద్యులు మాత్రం జాగ్రత్తగా ఉండడమొక్కటే మందు అని చెబుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్