- Advertisement -
ఘనంగా సిపిఐ శత వసంతోత్సవ ఉత్సవాలు
CPI centenary spring celebrations
తుగ్గలి:
తుగ్గలి మండలం నందు కడమకుంట్ల,రాంపల్లి, ఆర్.ఎస్ పెండేకల్లు,రామకొండ, మారెళ్ళ,బొందిమడుగుల,ముక్కెళ్ల గ్రామ శాఖల సమక్షంలో సిపిఐ పార్టీ శత వసంతోత్సవం వేడుకలను సిపిఐ పార్టీ నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నబి రసూల్,సిపిఐ సీనియర్ నాయకులు గురుదాస్,కర్నూలు జిల్లా సమితి సభ్యులు రోల్లపాడు వెంకటేశ్వర్లు,తుగ్గలి మండల కార్యదర్శి ఎస్.సుల్తాన్ బాషా సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నబి రసూల్,గురుదాస్, మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని,అదేవిధంగా భవిష్యత్తులో ప్రజా సమస్యల కోసం ప్రజలకు అండగా పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని పేద బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక కర్షకుల సమస్యల కోసం రైతు సమస్యల కోసం నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి చదువుల కాశీనాథ్,ఏ ఐ వై ఎఫ్ మండల సెక్రెటరీ వినోద్,సిపిఐ సీనియర్ నాయకులు రంగన్న,పుల్లన్న, హనుమంతు,సీపీఐ శాఖల కార్యదర్శిలు కాసిం,నబీ సాహెబ్,టైలర్ లాలెప్ప, మద్దిలేటి,వీరారెడ్డి,సూరారెడ్ డి,మాపీరా, వీరయ్య, మునిస్వామి,బొందిమడుగుల భాష,గిడ్డయ్య,జయరాం,మధు,జై రంగయ్య వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -