హీరో అక్కినేని నాగార్జునకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓపెన్‌ ఛాలెంజ్‌

- Advertisement -

హీరో అక్కినేని నాగార్జునకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓపెన్‌ ఛాలెంజ్‌ విసిరారు…!!!

CPI National Secretary Narayana Open Challenge to Hero Akkineni Nagarjuna 

తుమ్మిడికుంట చెరువును కబ్జా చేయలేదని.. ఎన్‌ కన్వెన్షన్‌ దగ్గరకు వచ్చి చెప్పగలరా అని సవాల్ చేశారు. చెరువును కబ్జా చేసి, దొంగ పట్టాలు సృష్టించిన హీరో నాగార్జున.. సినిమా డైలాగులు కొడతానంటే నడవదని విమర్శించారు. ఈ పదేళ్ల పాటు ఎన్‌కన్వెన్షన్ ద్వారా సంపాదించిన డబ్బులన్నీ ప్రభుత్వానికి తిరిగి కట్టేయాలన్నారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీపీఐ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్న చెప్పిన ఆయన.. అదే సమయంలో పేద వాళ్లపై ప్రతాపం చూపకుండా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమంగా నిర్మించిన బిల్డింగులను కూడా కూల్చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సలహా ఇచ్చారు. వారు చెరువులు ఆక్రమించుకుని కాలేజీలు కట్టారని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటును స్వాగతించిన సీపీఐ నారాయణ.. హైదరాబాద్ చుట్టుపక్కల కుంటలు, చెరువులను కాపాడాలన్నారు. అక్రమ కట్టడాల నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular