- Advertisement -
రిలయన్స్ స్మార్ట్ బజార్ సీజ్ చేయాలనీ సిపిఐ ఆందోళన
CPI's concern is to seize Reliance Smart Bazaar
డోన్
రిలయన్స్ స్మార్ట్ బజార్ సీజ్ చేయాలనీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ బజార్ ఎదుట ఆందోళన చేశారు,స్థానిక డోన్ పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్ ను డోన్ ఆర్ డి ఓ ఆదేశాల మేరకు సీజ్ చేసిన డోన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మస్తాన్ చేయడం జరిగింది, వివరాల్లో వెళ్ళితే శుక్రవారం ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రిలయన్స్ స్మార్ట్ బజార్ షాపింగ్ మాల్ దగ్గర ధర్నా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్యన్ . రంగనాయుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుపి . సుంకయ్య పాల్గొన్నారు,ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ డోన్ పట్టణంలోని దాదాపుగా మూడు నెలలక్రిందట రిలయన్స్ స్మార్ట్ బజార్ స్టార్ట్ చేశారు,షాపింగ్ మాల్ అయితే కొద్దిగా రోజులుగా షాపింగ్ మాల్ జోరుగా నడుస్తుంది సందర్భంగా జనాలకి తక్కువ రేటుతో కాలం చెల్లిన శీతాల పానీయాలు బెడ్ ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు ఆహారం వస్తువులు బహిరంగగా వ్యాపారం విచ్చలవిడిగా అమ్ముతున్న కార్పొరేట్ శక్తులు
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు ఇప్పటికే అనారోగ్యంతో పాలవుతున్నారని అన్నారు,
వంద రూపాయలు చేసే దాన్ని పది రూపాయలకే అమ్ముతున్నారు ఈ కథనాలను అన్నిబయటికి వచ్చిన తర్వాత కర్నూలు నుంచి నంద్యాల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి తనిఖీ చేయగా దాదాపుగా కాలం చెల్లిన70 సంచుల గోధుమపిండి ఎక్కడ సరఫరా చేశారో తెలియదు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారని మా దృష్టికి రావడం మేము ఎంక్వయిరీ చేశాం ఈ రిపోర్టుని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రిపోర్ట్ అందిస్తామని బహిరంగ గా చెప్పారు అయితే రిలయన్స్ స్మార్ట్ బజార్ షాపింగ్ మాల్ యధావిధిగా అమ్ముతున్నారు మరి రాత్రి రాత్రి కొద్దిసేపు అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి వ్యాపారం చేస్తున్న షాపు సీజ్ చేయకుండా అమ్ముతున్న సోద్యం చూస్తున్న అధికారులను అని అన్నారు,
డోన్ పట్టణంలోనే రెస్టారెంట్లు దగ్గర నెల నెలకు మామూలు వసూలు చేస్తున్నారని ప్రజల ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటి వ్యాపారాలని సహకరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులను సస్పెండ్ చేయాలని రిలయన్స్ స్మార్ట్ బజారు యజమాన్యంపై కఠినం చర్యలు తీసుకొని వారిని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇలాంటివి జరిగితే ప్రజలందరినీ ఏకం చేసి సిపి ఐ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బి నారాయణ పట్టణ కార్యదర్శి రామ్మోహన్ ఏఐటీయూసీ నియోజవర్గం కార్యదర్శి అబ్బాసుఏ ఐ యస్ యఫ్ జిల్లా అధ్యక్షులు సూర్య ప్రతాప్ ఏ ఐ యస్ యఫ్ నాయకులు రజాక్ దివాకర్ విజయ్ ఏ ఐ యస్ యఫ్ మండల కార్యదర్శి మనోజు మహిళా కార్యదర్శులు అమృత రెడ్డి, లక్ష్మీదేవి,పట్టణ కార్యదర్శి సిరీన్,జె మాధవి షబానా తదితరులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



