Sunday, September 8, 2024

సోషలిజాన్ని సజీవంగా ఉంచడానికి సీపీఐ కృషి

- Advertisement -

సోషలిజాన్ని సజీవంగా ఉంచడానికి సీపీఐ కృషి

సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్

జగిత్యాల
సోషలిజాన్ని సజీవంగా ఉంచడానికి సీపీఐ నిరంతరం కృషి చేస్తుందని జగిత్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి వెన్న సురేష్ అన్నారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సభ్యత్వ  నమోదు కార్యక్రమం చేపట్టగా అందులో భాగంగానే జగిత్యాల జిల్లా కార్యాలయంలో శనివారం జగిత్యాల పట్టణ సభ్యత్వ నమోదు కార్యక్రమన్నీ సిపిఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సురేష్
మాట్లాడుతూ సీపీఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రమజీవులైన కార్మికులు, రైతు కూలీలు, చిన్న, సన్నకారు రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, బీసీ, ఎస్సీ ,ఎస్టీలు యువకులు, విద్యార్థులు, మహిళలు మేధావులు, బుద్ధి జీవులు వినియోగించుకోవాలన్నారు.1925లో పార్టీ ఆవిర్భవించి భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సంపూర్ణ స్వరాజ్యమనే నినాదంతో ముందుకు వెళుతున్న సందర్భంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని స్వతంత్రాన్ని సాధించుకునేంతవరకు అలుపెరుగని పోరాటం చేసిందని తెలిపారు.
అలాగే తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన పార్టీగా సిపిఐ చరిత్రలో నిలిచిందన్నారు.ఈ దేశంలో భూ సంస్కరణలో ముఖ్యపాత్ర వహించిందని అలాగే శ్రామిక వర్గ పార్టీగా శ్రమజీవుల పక్షాన నిలిచి అనేక చట్టాలను రూపొందించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చిందని  అలాగే ఉపాధి హామీ లాంటి చట్టాలు రూపొందించడంలో పార్టీ ఎంతో శ్రమించిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు జాతీయ పార్టీగా ముందుగా నిర్ణయం తీసుకుంది సిపిఐ పార్టీ అని సురేష్ గుర్తుచేశారు.
ఈ దేశంలో బిజెపి హిందుత్వ పేరుతో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసే కుట్రలను పసిగట్టిన సిపిఐ పార్టీ  వ్యతిరేకంగా హిందూ ధర్మంలోని లౌకికత్వాన్ని కాపాడే విధంగా అన్ని లౌకిక పార్టీలతో కలుపుకొని ముందుకు వెళుతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.హిందుత్వంకు హిందూ ధర్మానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని సిపిఐ పార్టీ ప్రజలను పదేపదే కోరుతుందని వివరించారు.
ఇది నచ్చని బిజెపి హిందుత్వవాదులు సిపిఐ హిందూ ధర్మానికి వ్యతిరేక పార్టీ అని విమర్శించడం వల్ల హిందూ ధర్మాన్ని రోజువారి తమ నిత్యజీవితంలో ప్రాక్టీస్ చేసే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ప్రజలు  హిందుత్వానికి, హిందూ ధర్మానికి మధ్య తేడాను గుర్తించాలన్నారు.
హిందుత్వ అంటే ఒకే దేవుడు, ఒకే భాష అని… హిందూ ధర్మం అంటే అనేక సంస్కృతులు , విభిన్న దైవ విశ్వాసాలతో కూడిన సెక్యులర్ మత ధర్మమని ప్రజలు గ్రహించాలని
ఇదే భారత కమ్యూనిస్టు పార్టీ కోరుతుందని అన్నారు.
సీపీఐ లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా అంతరాలు లేని మానవీయ సమాజాన్ని కోరుకోవడమే అవుతుందని చెబుతూ ఇలాంటి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్యదర్శి వెన్న సురేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కోరుకంటి శ్రీనివాస్, శ్రీ గాద దేవదాసు, వెన్న మహేష్ ,పోలోజు గణేష్ ,అక్క పెళ్లి గంగాధర్ ,మడుపు సురేందర్, కోరుకుంటే జలంధర్, నాగసముద్రపు శివకుమార్  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్