- Advertisement -
విద్యుత్ చార్జీల పెంపుదలను వెంటనే ఉపసరించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్..
CPM party demands immediate withdrawal of hike in electricity charges.
డోన్
రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ పెంపు భారం వేయడం సిగ్గు చేటు అని సీపీఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్, కోయలకొండ నాగరాజు అన్నారు,స్థానిక డోన్ లో బేతంచెర్ల సర్కిల్ వద్ద శనివారం ఉదయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ కరెంటు బిల్లులను దగ్ధం చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల నాయకులు నాగ మద్దయ్య అధ్యక్షతన జరిగింది, ఈ సందర్బంగా సీపీఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్, కోయలకొండ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారం కోసం ప్రజలను నమ్మించడానికి విద్యుత్ చార్జీలు ఐదు సంవత్సరాలు పెంచబోమని రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొడతామని ,ధ్వంసం చేస్తామని చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ప్రజా వేదికల మీద చెప్పారు నేడు వాటికి విరుద్ధంగా రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్లు విద్యుత్తు చార్జీల భారాన్ని మోపబోతున్నారని వారు ఆరోపించారు, విద్యుత్తు ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ చార్జీల పేరుతో అసలు కంటే కొసరు ఎక్కువ వేస్తున్నారని వారు ఆరోపించారు, స్మార్ట్ మీటర్లు, షాపులకు, రైతు బోర్లకు ,గృహాలకు బిగిస్తున్నారని ప్రజల ఉరితాడు*
బిగించబోతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు, సెల్ఫోన్ కు రీఛార్జి చేసుకున్నట్లు ముందుగానే విద్యుత్ స్మార్ట్ మీటర్లకు డబ్బులు చెల్లిస్తానే కరెంటు ఉంటుందని లేకపోతే అర్ధరాత్రి పూట కరెంటు పోయే అవకాశం ఉందన్నారు, అనేకమందికి గ్రామీణ ప్రాంతాల్లో రీఛార్జ్ చేసుకునే సదుపాయం, నెట్వర్క్ లేని వసతులు ఉన్నాయని, ఇటువంటి సందర్భంగా ముందుగానే కరెంటు రీఛార్జి చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదలకు చదువు లేకపోవడం వల్ల, టెక్నాలజీ తెలియనటువంటి వారు చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు, కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆదానితో చేసుకున్న ఒప్పందాలు మూలంగా జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు ముడుపులు చెల్లించినట్లు అమెరికాలో కేసు నమోదు అయిందని వారు తెలిపారు, కావున రాష్ట్రంలో ఉన్నటువంటి టిడిపి కూటమి ప్రభుత్వం ఆదాని తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని వారి డిమాండ్ చేశారు ,ఇప్పటికే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రైతు బోర్లకు స్మార్ట్ మీటర్లు బిగించి రైతు మెడలకు ఉరితాడు బిగించబోతున్నారని వారు ఆరోపించారు,ఈకార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి నక్కి హరి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి జె.అశోక్,సిపిఎం నాయకులు మధుసూదన్,ఎర్రమల, ఆదినారాయణ,నాగరాజు, శిక్షావలి, సుధాకర్,చరణ్ సుంకన్న,రాజేంద్ర,లక్ష్మన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -