ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో సీపీఆర్, ఫస్ట్ ఏడ్ కీలకం
CPR and First Aid are crucial in saving lives during an accident
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో
ఫస్ట్ రెస్పాండర్స్ కు సీపీఆర్, ఫస్ట్ ఏడ్ లపై శిక్షణ ,ఫస్ట్ ఏడ్ కిట్స్ పంపిణి
జగిత్యాల,
ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో సీపీఆర్, ఫస్ట్ ఏడ్ కీలకం ఆని,ప్రమాదం జరిగిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రహదారులకు అనుకోని ఉన్న దుకాణాలు,
హోటల్‌లు,పంక్చర్ షాప్, పెట్రోల్ పంపులు నడిపే ఫస్ట్ రెస్పాండర్స్ కు సీపీఆర్, ఫస్ట్ ఏడ్ పై
శిక్షణ కార్యక్రమం నిర్వహించి, ఫస్ట్ ఏడ్ కిట్స్ పంపిణి చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై
ఈ సందర్భంగా కలెక్టర్
ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో సీపీఆర్ మరియు
ఫస్ట్ ఏడ్ చాలా కీలకమని కీలకం అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఉపయోగించి ప్రాణాలు కాపాడే విధంగా ఉండాలని సూచించారు. ప్రమాధాలు జరిగిన సందర్భాల్లో మొదటగా స్పందిచేది ఆ పరిసరాల్లో ఉన్న వివిధ షాప్ లలో ఉన్న వారికి
సీపీఆర్ మరియు
ఫస్ట్ ఏడ్ గురించి అవగాహన ఉంటే చాలా వరకు ప్రాణాలు కాపడవచ్చు అనే ఉద్దేశ్యంతో పోలీస్ శాఖ వారు ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ఆనంతరం ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రమాధాలు జరిగిన సందర్భాల్లో ప్రథమ చికిత్స సమయానికి అందక చాలా మంది మరణిస్తున్నరని,ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గోల్డెన్ అవర్ ఉంటుంది అని ఆ గోల్డెన్ అవర్(గంట) సమయంలో సాధ్యమైనంత వరకు కష్టపడి ఆ వ్యక్తిని బతికించవచ్చని తెలిపారు.ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడం,హాస్పిటల్ కి తరలించి వారి ప్రాణాలు కాపాడడం ముఖ్యమని తెలిపారు.సోషల్ మీడియాలో చూసి ప్రమాధాలు జరిగినప్పుడు సీపీఆర్, ప్రథమ చికిత్స చేస్తున్నారని దానివలన ఎక్కువ ప్రమాధాలు జరిగే అవకాశం ఉంటాదాని దానికోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రధాన రహదారులకు అనుకోని ఉన్న దుకాణాలు,హోటల్‌లు,పంక్చర్ షాప్, పెట్రోల్ పంపులు నడిపే వారికి
సీపీఆర్ మరియు
ఫస్ట్ ఏడ్ లపై శిక్షణ ఇస్తున్నామని అంతే కాకుండా ప్రతి పోలిస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సీపీఆర్ మరియు
ఫస్ట్ ఏడ్ లపై శిక్షణ ఇవ్వడం జరుగుతుదని ఎస్పీ తెలిపారు.
రోడ్డు ప్రమాధాలు జరిగిన సమయాల్లో,స్పృహ తప్పి పడిపోయిన సందర్భంగాల్లో,ఎండ దెబ్బ తగిలిన సందగర్బాల్లో,పాము కాటుకు గురైన సందర్బాలో, గుండె పోటు వచ్చిన సందర్బాలో ఎలాంటి ప్రథమ చికిత్సలు అందించాలనే అంశాలపిఎ వైద్య నిపుణులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్,ఐఏంఏ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, ఇన్స్పెక్టర్లు రఫీక్ ఖాన్, ఎస్.ఐలు ఫస్ట్ రెస్పాండర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.