- Advertisement -
అనారోగ్యంతో మృతి చెందిన సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కు స్వగ్రామంలో అంత్యక్రియలు
CRPF Head Constable, who died due to illness, was cremated in his hometown
వజ్రకరూరు మండలం కొనకొండ్లలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు…
కన్నీటి వీడ్కోలు పలికిన స్థానిక పోలీసులు
జిల్లా ఎస్పీ సంతాపం…అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోసిన వజ్రకరూరు ఎస్సై
అనంతపురం
వజ్రకరూరు మండలం కొనకొండ్లకు చెందిన బి.రమేష్ హైదరాబాద్ మూడవబెటాలియన్ లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గాపని చేస్తున్నాడు. ఇతను అనారోగ్యంతో నిన్న హైదరాబాద్ లో చనిపోయారు. స్వగ్రామమైన వజ్రకరూరు మండలం కొనకొండ్లలో ఆయన మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. అంతిమ యాత్రలో వజ్రకరూరు ఎస్సై నాగస్వామి పాల్గొని పాడె మోశారు. స్థానిక పోలీసులు కన్నీటి వీడ్కోలు పలికారు. లో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ M.V.కృష్ణయ్య, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
- Advertisement -