Sunday, September 8, 2024

కూకట్‌పల్లిలో దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా సమావేశం

- Advertisement -

పురంధేశ్వరి కామెంట్స్

బిజెపి మిత్రపక్షమైన జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు ఓటు వేస్తే , అతడి ద్వారా నియోజక వర్గంలో అభివృద్ది పనులకు బిజెపి మద్దతు ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది అవసరం అని ప్రజలు భావిస్తున్నారు.

బి ఆర్ ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారిపోయాయి.

బిజెపి, జన సేన పార్టీ ప్రజల సమస్యల పై గళం విప్పి పోరాడే పార్టీలు.

ఈ పార్టీల అభ్యర్థులకు ఆదరిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి.

నియోజకవర్గంలో ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

మోస పూరిత వాగ్దానాలతో రెండు సార్లు అధికారం లోకి వచ్చిన బి అర్ ఎస్ పార్టీ పై ప్రజలు ఆలోచించుకోవాలి అని కోరుతున్నాను

ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలపాటు అధికారంలో ఉంది మాట తప్పారు

ఒక్కసారి టి ఎస్ పి ఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, అదే కార్యాలయం ద్వారా పేపర్ లీక్ అవ్వటంతో అభ్యర్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనేది బి అర్ ఎస్ చెప్పాల్సిన అవసరం ఉంది.

పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని గొప్ప వాగ్దానాలు చేశారు కానీ ఆ హామీ నెరవేర్చలేదని

జి హెచ్ యం సి లో 9 లక్షల అప్లికేషన్స్ ఉండగా కేవలం 50 వేల ఇండ్లు మాత్రమే నిర్మించారు

పేదవాడి సొంతింటి కళ కలగానే మిగిలిపోయింది.

దళితుడిని ముఖ్య మంత్రి చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.

దళితులకు భూమి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదు.

దళితబందు స్కీమ్ లో అవినీతి జరుగుతుంది.

ఆ అవినీతినీ కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు.

పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయులకు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయటం లేదు.

ఏ హామీ నెరవేర్చారు అనేది చెప్పి కేసీఆర్ ఓటు అడగాలి.

దేశంలో 4 కోట్ల ఇండ్లను మంజూరు చేశారు…వాటిలో 3 కోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసాము.

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం లో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి.

అనేక అభివృద్ది కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాభాగం ఉన్నది.

సబ్ కె సాత్ సబ్ కా వికాస్ అంటూ అందరి అభివృద్ధిని కాంక్షితున్నది బిజెపి పార్టీ. ప్రస్తుత స్థానిక ఎమ్మేల్యే చేసిన పనుల పై చార్జీ షీట్ విడుదల చేసిన పురందేశ్వరి.

ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చని కూకట్పల్లి ఎమ్మెల్యే.

ఐడియల్ భూములను ఎమ్మేల్యే అనుచరుల కబ్జా.

బిసి కుల జాబితా నుండి తొలగించిన ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను తొలగించి వాటిని తిరిగి చేర్చలేదు.

చెరువులు, నాలలని, పార్కు స్థలాలను కబ్జా చేసి ఎమ్మేల్యే అనుచరులు నిర్మాణాలు చేపడుతున్నారు.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను బినామీలు, అనుచరులతో కలిసి కబ్జా చేశారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాధవరం కృష్ణారావుకు ఓటు అడిగే హక్కులేదు.

డబుల్ బెడ్ రూం ల విషయంలో పూర్తిగా విఫలమయ్యారు.

అర్హులకు తొమ్మిది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు.

ప్రశ్నించే వారి పై బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్