Thursday, November 7, 2024

ప్రతి 15 రోజులకొక డామేజ్

- Advertisement -

ప్రతి 15 రోజులకొక డామేజ్

Damage every 15 days
విజయవాడ, సెప్టెంబర్ 2 (న్యూస్ పల్స్)

వైసీపీకి భారీ డ్యామేజ్ జరుగుతోందా? ఆ పార్టీ నైతికత దెబ్బతింటోందా? అది చేజేతులా హై కమాండ్ చేసుకున్న నష్టమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం వైసిపి నైతికత దెబ్బతినేలా ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షం రోజులకు ఒక వీడియో బయటకు వస్తోంది. తొలుత విజయసాయిరెడ్డి ఎపిసోడ్ నడిచింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త తెరపైకి వచ్చారు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డి పై అనుమానం వ్యక్తం చేశారు. డీఎన్ఏ టెస్ట్ కు డిమాండ్ చేశారు. కానీ ఎందుకో ఆయన అనుమానాలను నివృత్తి చేసేలా.. వైసీపీ నుంచి ఎటువంటి సమాధానం లేదు. కానీ ఇష్యూను డైవర్ట్ చేసి సైలెంట్ అయ్యారు. అటు తరువాత ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం బయటపడింది. కుటుంబ కథ అనుకున్నా.. ఇంతటి విభాగానికి ఓ మహిళ కారణమని బయటపడింది. దాదాపు పక్షం రోజులు రచ్చ నడిచింది. ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇంతలోనే ఎమ్మెల్సీ అనంత బాబు అసభ్య వీడియో బయటకు వచ్చింది. అది మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ చెబుతున్నా.. బాధితులే స్వయంగా బయట పెట్టడంతో వైసిపికి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇలా మొత్తం ఎపిసోడ్లలో వైసిపి నైతికత దెబ్బతింది.వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి జరిగాయి. కానీ అధికారంలో ఉండడంతో అన్ని కొట్టుకెళ్ళాయి. కానీ ఇప్పుడు విపక్షానికి వచ్చేసరికి సీన్ సితార్ అవుతోంది. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాంసం తిన్నామని ఎముకలు మెడకు కట్టుకుంటే ఎలా ఉంటుందో.. వైసిపి చర్యలు అలానే ఉండేది. కానీ ప్రతిపక్షంలో వచ్చేసరికి అవన్నీ వికటించాయి. వైసీపీ నైతికతను ప్రశ్నించే పరిస్థితికి దాపురించాయి.వైసీపీలోని మాజీ మంత్రుల్లో ఒకరు అరగంట అన్నారు. మరొకరు గంట చాలని అన్నారు. అయితే ఇలా అన్నది మహిళలతో. ఆ ఆడియోలు అప్పట్లో బయటకు వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నాడు వైసిపి హై కమాండ్ స్పందించలేదు. కనీసం ఖండించలేదు కూడా. దీంతో వైసీపీలో ఇదో అలవాటైన అంశంగా మారిపోయింది. అటు తరువాత ఓ ఎంపీ అసభ్య వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పుడు కూడా వైసిపి హై కమాండ్ ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు.ప్రజాక్షేత్రంలో ఉన్న పార్టీలో నేతలు తప్పు చేస్తే ఆ ప్రభావం పార్టీపై చూపడం ఖాయం. అయితే ఈ విషయంలో వైసీపీ హై కమాండ్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నేతల వివాదాస్పద వ్యవహార శైలి బయటపడినా.. పెద్దగా స్పందించలేదు. నేతలపై చర్యలకు ఉపక్రమించలేదు. అందుకే ఇప్పుడు పార్టీ నైతికత దెబ్బతీసేలా నెలకు ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. తొలుత విజయసాయిరెడ్డి, తరువాత ఎమ్మెల్సీ దువ్వాడ, నిన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఈరోజు ముంబై నటి వ్యవహారం వైసిపి మెడకు చుట్టుకుంది. ఆ పార్టీ నైతికతను దెబ్బతీసేలా ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్