Sunday, September 8, 2024

కాంగ్రెస్ లో చీలక ప్రమాదం

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 2, (వాయిస్ టుడే ):  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. గత 90 రోజులుగా సాగిన ఎన్నికల సందడికి గురువారంతో ముగింపు పలికినట్లు అయింది. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఈవీఎంల్లో భద్రంగా పొందుపరిచారు. ఎన్నికల తతంగం ముగియక ముందే ఎగ్జిట్ పోల్స్ హంగామా చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని మెజార్టీ సర్వే సంస్థల ఎగ్టిట్ పోల్స్ వెల్లడించాయి. కొన్ని సర్వేలు రాష్ట్రంలో హంగ్ వస్తుందని తెలిపాయి. ఒకటి, రెండు సర్వేలు మాత్రమే అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు చెప్పడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా నిరాశలో కురుకుపోయాయి. ఎగ్జిట్ పోల్స్‌పై మాట్లాడిన కేటీఆర్.. కార్యకర్తలు అధైర్యపడవద్దని.. మనమే గెలుస్తున్నామని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారంటూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాలంటే కొన్ని లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.అధికార బీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్‌ కొట్టాలని సర్వశక్తులు ఒడ్డింది. ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోయేలా వ్యూహాలు అమలు చేసింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ‍్య పోటీ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి తామే లబ్ధి పొందుతామని లెక్కలు వేసుకున్నారు. కానీ సర్వే ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడంతో గులాబీ శిబిరంలో గుబులు మొదలైంది. కానీ, తెర వెనుక పెద్ద ప్లాన్‌ నడుస్తోందని సమాచారం. బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో 45 స్థానాలు గెలిచినా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సిఎంగా చరిత్ర సృష్టిస్తాడని అంటున్నారు. అదెలా అంటే.. బీఆర్‌ఎస్‌ 45, మిత్రపక్షం ఎంఐఎం 7 సీట్లు గెలిస్తే.. బలం 52కు చేరుతుంది. అయినా మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరదు..ఇక కాంగ్రెస్‌లో చీలిక ఖాయమంటున్నారు. ప్రస్తుతం పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 25 మంది బీఆర్‌ఎస్‌ ఫైనాన్స్‌ చేసిన వారు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో అభ్యర్థికి గులాబీ పార్టీ నుంచి రూ.10 కోట్లు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరంగా ఉంటే.. వీరంతా వెంటనే గులాబీ శిబిరంలో చేరతారని తెలుస్తోంది. ఇందుకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇవ్వడానికి కూడా కేసీఆర్‌ వెనుకాడరని ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీకి 50 సీట్లు వస్తే.. ఎంఐఎం మద్దతుతో అధికారాన్ని చేపట్టవచ్చని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఎంఐఎం ఎలాగూ 7 స్థానాల్లో గెలుస్తుంది కాబట్టి.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టంగా 65 నుంచి 70 సీట్లు వస్తేనే హస్తం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందంటున్నారు. మా‍్యచిక్‌ ఫిగర్‌కు ఒకటి రెండు సీట్లు తక్కువ వచ్చినా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని పేర్కొంటున్నారు. మరి తెరవెనుక రాజకీయం నెగ్గుతుందా.. తెలంగాణ ప్రజలు స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అనేది డిసెంబర్‌ 3న తేలిపోతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్