- Advertisement -
తండ్రి బాకీ కోసం కూతురు ఆత్మహత్య
Daughter commits suicide for father's debt
మేడ్చల్
తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని దీప్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని – నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాచారం సరస్వతి నగర్ కాలనీలో జరిగింది. చెందిన పులివర్తి సంగీత్ రావు కుమార్తె దీప్తి (29) ఐఐసీటీలో పీహెచ్డీ చేస్తోంది. వీరి ఇంటి ఎదురుగా ఉండే కానిస్టేబుల్ అనిల్.. తన భార్యకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సంగీత్ రావు 2022లో రూ.15 లక్షలు తీసుకొని మోసం చేశాడని నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. దీంతో అనిల్ కి రూ.8 లక్షలు తిరిగి ఇచ్చినట్లు దీప్తి కుటుంబ సభ్యులు తెలిపినప్పటికీ డబ్బుల కోసం తన కూతురు దీప్తిని పోలీస్ స్టేషన్కు పిలిపించి తప్పుడు కేసులు పెట్టారని సంగీత్ రావు ఆరోనించాడు. కేసు విత్ డ్రా చేసుకోవాలంటే రూ.35 లక్షలివ్వాలని అనిల్ మామ సోమయ్య, భార్య అనిత, అనిత సోదరుడు సైదులు దీప్తిని డిమాండ్ చేసారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని సమాధానం చెప్పింది. అయినా ఆమె ఎంత చెప్పినా వినకుండా కేసులు పెట్టి పలుమార్లు పోలీస్ స్టేషన్కు పిలిచి బెదిరించాడు అనిల్. దీంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది దీప్తి. తాను ఇంత కఠిన నిర్ణయం తీసుకోవటానికి పోలీసులు వేధింపులే కారణమని ఆరోపిస్తూ మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంది. .
- Advertisement -