అంగన్ వాడీ వేతనాలు పెంచాలని..
14వ రోజు కళ్లకు గంతలు కట్టుకొని సమ్మె క్రిస్మస్ కేకును శిబిరంలో కట్ చేసి నిరసన
అదోని
అంబేద్కర్ విగ్రహం ముందు అంగన్వాడీల వేతనా లు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని14 వ రోజు నిరవధిక సమ్మె శిబిరంలో అంగన్ వాడి లు కళ్ళకు గంతలు (నల్ల రిబ్బన్తో తో) కట్టుకొని, క్రిస్మస్ కేకును కట్ చేసి, ప్రభుత్వానికి నిరసన తేలిపారు ఈ కార్యక్రమనికి ప్రాజెక్టు యూనియన్ నాయకురాలు వరలక్ష్మి,జానకి అధ్యక్షతన ప్రారంభమైంది కార్యక్రమo లో ఉద్దేశించి సీఐటీయూ సీనియర్ నాయకులు. పీ ఈరన్న . మాట్లాడుతూ 14 రోజులు సమ్మె చేస్తున్న జీతాలు పెంచకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీతాలను పెంచాలని . సిఐటియు.కార్యదర్శులు తిప్పన్నా గోపాల్. సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు. వీరారెడ్డి. అజీమ్ ఖాన్ . రైతు సంఘం జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి.ఎఐటియుసి పట్టణ నాయకులు టి వీరేష్ . విజయ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ గారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలైన తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాచుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలి .పెన్షన్స్ సౌకర్యం చివరి జీతం లో 50% ఇవ్వాలి .రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి. సూపర్వైజర్ ప్రమోషన్ కి 50 సంవత్సరాలు పెంచాలి సర్వీసులో చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. వేతనంతో కూడిన లీవ్ సౌకర్యం కల్పించాలి మెనూ ఛార్జీలను పెంచాలి గ్యాస్ ప్రభుత్వమే సర్ఫుర చేయాలి పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు టిఏ బిల్లులు ఇవ్వాలి ఫేస్ యాప్ లను రద్దు చేయాలి. తదితరుల డిమాండ్ల ను పరిష్కరించాలని కాబట్టి ఎన్నికల ముందు జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పటికైనా మా యొక్క న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెలో కొనసాగుతామని పిలుపునిచ్చారు .కార్యక్రమంలో అంగన్వాడీ వర్క ర్లు పద్మా ,రేణుక, సరోజ, సోమక్క. గీత. వీరమ్మ, మీనా కుమారి, రిజ్వానా, ,శారద,ఈరమ్మ, అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు
14వ రోజు కళ్లకు గంతలు కట్టుకొని సమ్మె
- Advertisement -
- Advertisement -



