- Advertisement -
7వరోజు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము “మీకోసం మీ వేనిగండ్ల”ఉదయపు పర్యటన
Day 7 Morning tour of Gudivada MLA Venigandla Ramu "For you, Me Venigandla"ప్రధాన రహదారుల్లోని దుకాణదారులు, చిరు వ్యాపారులతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
వ్యాపారులు తీరు మార్చుకోకుంటే.. జరిమానాలు తప్పవని హెచ్చరిక:ఎమ్మెల్యే
గుడివాడ డిసెంబర్ 09
గుడివాడ పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుకు ప్రతి ఒక్కరు తమ సహకారం అందించాలని, రోడ్లు వెంబడి దుకాణదారులు, చిరు వ్యాపారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని…నిర్లక్ష్యం వహించే వారికి జరిమానాలు తప్పవని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. గుడివాడ పట్టణంలో పారిశుధ్య మెరుగుకు… ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహిస్తున్న “మీకోసం మీ వెనిగండ్ల” ఉదయపు పర్యటనలు 7వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే రాము.. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎక్కడికక్కడ రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు, స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు.ప్రధాన రహదారులు వెంబడి పలు దుకాణాల వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో.. సంబంధిత దుకాణదారులు, చిరు వ్యాపారులను ఎమ్మెల్యే రాము సున్నితంగా హెచ్చరించారు.మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే పారిశుద్ధ్య మెరుగుకు.. పురపాలక సంఘం చేస్తున్న కృషికి ఫలితం ఉంటుందని వ్యాపారులస్తులతో ఎమ్మెల్యే రాము అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణ అభివృద్ధి, పారిశుధ్య మెరుగు కోసం ఉదయపు పర్యటనలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. కొందరి నిర్లక్ష్యం వల్ల ఎంత కష్టపడిన ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఇక ఉపేక్షించేది లేదని పారిశుధ్య సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై జరిమానాలు విధిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము హెచ్చరించారు.ఎమ్మెల్యే రాము పర్యటనలో టిడిపి నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు.
- Advertisement -




