- Advertisement -
ఏనుగు మృతి
Death of an elephant
తిరుపతి
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పంచాయతీ పరిధిలోని మామిడి తోటలో ఓ ఏనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. మామిడి తోట యజమాని ఏనుగు మృతిపై భాకరాపేట అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగు మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలన జరిపారు. గత కొద్ది రోజులుగా చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలెం మండలాల్లో సుమారు 17 ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందింది మగ ఏనుగని వయసు సుమారు పది సంవత్సరాలు ఉంటుందన్నారు. ఏనుగు మృతికి కారణాలపై అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -