Sunday, September 8, 2024

రంజీత్ శ్రీనివాస్ మ‌ర్డ‌ర్ కేసులో 15 మంది దోషుల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌

- Advertisement -

రంజీత్ శ్రీనివాస్ మ‌ర్డ‌ర్ కేసులో 15 మంది దోషుల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌
మావెలిక్క‌ర అద‌న‌పు జిల్లా సెష‌న్స్ కోర్టు సంచ‌ల‌న తీర్పు
కోయంబత్తూర్ జనవరి 30
కేర‌ళ‌లోని మావెలిక్క‌ర అద‌న‌పు జిల్లా సెష‌న్స్ కోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. రంజీత్ శ్రీనివాస్ మ‌ర్డ‌ర్ కేసులో 15 మంది దోషుల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. ఇటీవ‌ల కాలం కేర‌ళ చ‌రిత్ర‌లో ఒకేసారి ఇంత మంది నిందితుల‌కు ఏ కోర్టు కూడా మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేయ‌లేదు. బీజేపీ నేత‌, లాయ‌ర్ రంజీత్ శ్రీనివాస్‌ను 2021, డిసెంబ‌ర్ 19న దారుణంగా హ‌త్య చేశారు. ఆ మర్డ‌ర్ కేసు నిందితుల్లో నైస‌మ్‌, అజ్మ‌ల్‌, అనూప్‌, అస్ల‌మ్‌, అబ్దుల్ క‌లామ్‌, స‌లామ్‌, స‌ఫారుద్దిన్‌, మ‌న్స‌ద్‌, జ‌సీబ్ రాజా, న‌వాస్‌, స‌మీర్‌, నాజిర్, జాకిర్ హుస్సేన్‌, షాజీ పూవ‌తుంగ‌ల్‌, షేర్నాస్ అష్ర‌ఫ్ ఉన్నారు. ఈ నిందితులు అంద‌రూ నిషేధిత పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)లో స‌భ్య‌త్వం క‌లిగి ఉన్నారు.జ‌డ్జి శ్రీదేవి వీజీ ఈ కేసులో తీర్పును వెలువ‌రించారు. నిందితుల‌కు అల‌పుజా ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో మెంట‌ల్ స్టెబులిటీ ప‌రీక్ష‌లు నిర్వ‌మించాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ మ‌ర్డ‌ర్ కేసులో తొలి 8 నిందితులపై ఐపీసీలోని 302, 149, 449, 506, 341 సెక్ష‌న్ల కింద కేసు రిజిస్ట‌ర్ చేశారు. వీరికి జీవిత కాల శిక్ష‌తో పాటు మ‌ర‌ణ‌దండ‌న విధించారు. అయితే తొలి 8 మంది ప్ర‌త్య‌క్షంగా మ‌ర్డ‌ర్‌లో పాలు పంచుకున్నారు. హ‌త్య‌కు గురైన బీజేపీ నేత ఇంటి ముందు ఆయుధాల‌తో నిఘా పెట్టిన‌ 9 నుంచి 12వ నిందితుడి వ‌ర‌కు వివిధ సెక్ష‌న్ల కింద కేసుల‌ను బుక్ చేశారు. ప్ర‌ధాన నిందితుల జాబితాలో జ‌కీర్‌, షాజీ, షెర్నాస్‌పై ఐపీసీలోని 120బీ, 302 కింద కేసు బుక్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్