Sunday, September 8, 2024

అప్పులు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు

- Advertisement -

అప్పులు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు

హైదరాబాద్, డిసెంబర్  20

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఇక 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేసింది. 2014-23 మధ్య బడ్జెట్‌ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉందన్నారు. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు ఉండగా.. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లు. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగిందని.. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో వెల్లడించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తం బడ్జెట్‌ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే.. బడ్జెట్‌కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని.. పదేళ్లలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదన్న ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లుగా 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం ద్వారా వెల్లడించింది.మరి దీనిపై ప్రతిపక్ష నేతలు ఏం సమాధానం ఇవ్వనున్నారు తెలియాల్సి ఉంది.
శాసన సభలో మళ్లీ వాడి వేడి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పులు ఊబిలో తెలంగా ఉందని అధికారపక నేతలు విపకాలపై విరుచుకుపడుతున్నాయి. అప్పులే కాదు ఆస్తులు కూడా పెరగాయని బీఆర్ఎస్ చెబుతుంది. అయితే దీనిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయడంతో.. శాసనసభలో ఆర్థిక స్థితిగతులపై హాట్ హాట్ గా చర్చ జరగనుంది. ఆర్థిక పరిస్థితిపై 42 పేటీలు ఇచ్చిన నిమిషంలోనే మాట్లాడమంటే ఎలా? అంటూ విపకాలు ప్రశ్నించాయి. కనీసం అరగంట పాటు సమయం ఇవ్వాలని అందులో ఏముందో తెలుసుకుని ప్రశ్నిస్తే బాగుంటుందని అన్నారు. కాగా.. అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం కాగానే అరగంటపాటు వాయిదా పడింది.
అంతా తప్పుల తడక
శ్వేత పత్రం కక్ష సాధింపు లెక్క.. వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అరగంట అనంతరం అసెంబ్లీ సమావేశం మొదలైంది. దీంతో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు లెక్క ఉంది ఈ శ్వేత పత్రం అన్నారు. రాష్ట్ర సర్కార్.. శ్వేత పత్రం చూస్తుంటే.. వాస్తవాల వక్రికరణల ఉందన్నారు. తప్పుల తడకగా రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని బధనాం చేసే ఆలోచనే కనపడుతుందని అన్నారు. ఆర్థిక స్థితిపై వైట్ పేపర్ ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేయలేదన్నారు. తెలంగాణ గత తొమ్మిదేళ్ళలలో చాలా రంగాల్లో తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. కానీ వైట్ పేపర్ లో ప్రభుత్వం తనకి అనుకూలంగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. హౌస్ కమిటీ వేయండని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పై చర్చ చేద్దామన్నారు. ఇవన్నీ సీఎం పాత గురువుకి చెందిన రిటైర్డు అధికారితో రాయించారన్నారు. మాజీ ఐఏఎస్ రిటైర్డ్ అధికారితో రాయించారని తెలిపారు.
అయితే ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇచ్చిన శ్వేత పత్రలెక్కల్లో తప్పు ఉంటే చెప్పండని కోరారు. కానీ.. ఎవరి పేరులో చెప్పి తప్పుదారి పట్టించొద్దని అన్నారు. రికార్డు నుండి తొలగించాలని కోరారు. దీంతో హరీష్ రావు మాట్లాడుతూ.. వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు కొలిచే విధానం ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారని అన్నారు. తెలంగాణ కంటే 22 రాష్ట్రాల్లో అప్పు ఎక్కువ తీసుకున్నాయన్నారు. రాజస్థాన్.. 5.37 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. కర్ణాటక కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆస్తుల కల్పన చేశామన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా శ్వేత పత్రం ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో అధ్భుత ప్రగతి సాధించామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్