బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు దీపాదాస్‌ మున్షీ లీగల్‌ నోటీసులు

- Advertisement -

బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు దీపాదాస్‌ మున్షీ లీగల్‌ నోటీసులు
హైదరాబాద్ ఫిబ్రవరి 27
బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ షాక్‌ ఇచ్చారు. ప్రభాకర్‌కు ఆమె లీగల్‌ నోటీసులు పంపారు. ఇటీవల ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ కాంగ్రెస్‌ నేతల నుంచి బెంజ్‌కారు లబ్ధి పొందినట్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించారు. ఆరోపణలపై రెండురోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రూ.10కోట్లకు పరువు నష్టం దావా చేయనున్నట్లు దీపాదాస్‌ మున్షీ హెచ్చరించారు. తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్‌రావు ఠాక్రే స్థానంలో దీపాదాస్‌ మున్షీని డిసెంబర్‌లో కాంగ్రెస్‌ నాయకత్వం నియమించింది.అయితే, త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎంపీ టికెట్‌ ఆశావాహుల్లో ఒకరు దీపాదాస్‌ మున్షీకి బెంజ్‌ కార్‌ను బహూకరించినట్లు ఆరోపించారు. దీపాదాస్‌కు బెంజ్‌ కారు కొనివ్వడంపై తనవద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ టికెట్‌ కోసం ఆమె ఎవరు కారును గిఫ్ట్‌గా ఇచ్చారన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. దీపాదాస్‌ మున్షీపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. దీపాదాస్ మున్షీ, ఆమెకు గిఫ్ట్ ఇచ్చిన నేతలు స్పందిస్తేనే తాను సమాధానం చెబుతానని, ఆధారాలు చూపిస్తానన్నారు. ఈ క్రమంలోనే తనపై చేసిన ఆరోపణలపై దీపాదాస్‌ మున్షీ బీజేపీ నేతకు లీగల్‌ నోటీసులు పంపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular