Sunday, September 8, 2024

డీఎస్సీపై పక్కా ప్లాన్…

- Advertisement -

డీఎస్సీపై పక్కా ప్లాన్…
విజయనగరం, జూన్ 25,
ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూన్ 24న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 16,347 పోస్టులను డిసెంబర్ 10లోపు భర్తీ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. మెగా డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై మంత్రి వర్గ భేటీలో చర్చించారు.  డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారులు క్యాబినెట్‌లో చర్చించారు. టెట్ లేకుండా అయితే నవంబరు 15లోపు, టెట్‌తో అయితే డిసెంబరు 10లోపు డీఎస్సీ ప్రక్రియ ముగించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.
జులై 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్‌ 10లోపు ముగిసేలా ప్రణాళికను రూపొందించారు మెగా డీఎస్సీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.ఏపీలో గత ప్రభుత్వం 6100 టీచర్ పోస్టులతో ఫిబ్రవరి 12న డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి 4,72,487 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ నోటిఫికేషన్‌లో గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్‌ కారణంగా అది వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచింది. గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీని రద్దుచేసిన.. టీడీపీ ప్రభుత్వం తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇంచ్చింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు.
మెగా డీఎస్సీ 2024 పోస్టుల వివరాలు..
క్ర.సం. విభాగం పోస్టుల సంఖ్య
1) స్కూల్ అసిస్టెంట్ (SA) 7725
2) సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) 6371
3) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) 1781
4) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) 286
5) ప్రిన్సిపల్స్ 52
6) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) 132
– మొత్తం ఖాళీలు 16,347

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్