మున్నూరుకాపు కార్పోరేషన్ ఏర్పాటు కు హామీ పట్ల హర్షం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలవాలని నిర్ణయం
ఖమ్మం :: కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బి.సి. డిక్లరేషన్ లో మున్నూరు కాపుల అభ్యున్నతి కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల మున్నూరుకాపు సంఘం జిల్లా నాయకులు హర్షం వెలిబుచ్చారు..శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో INTUCజిల్లా అధ్యక్షుడు కొత్తా సీతా రాములు,రాష్ట్ర మున్నూరు కాపు సంఘం కార్యదర్శి శెట్టి రంగరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కల్లూరి సోమనాధం, పసుపులేటి దేవెందర్, తాళ్లూరి హన్మంతరావు, సంపెట సంపెట నరసింగరావు , గంగిశెట్టి శ్రీనివాసరావు , సముద్రాల శ్రీనివాస్ , సిరంశెట్టి వేణు తదితరులు మాట్లడారు.సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ లో నేడు అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు .. కాపులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దశాబ్దాల అని పేర్కొన్నారు .. ఈ ఎన్నికల్లో రాష్ట్రం లోని మున్నూరుకాపులంతా కాంగ్రెస్ అండగా నిలవాలని కోరారు.. కార్పోరేషన్ ఏర్పాటును ప్రకటించిన కర్నాటక సీఎం సిద్దరామయ్య కు , ఈ నిర్ణయం తీసుకోవడం లో కీలకపాత్ర పోషించిన వి. హన్నంతరావు కి కృతజ్ఞతలు తెలిపారు.



