మేడిపల్లి, (సిపిఐఆర్) రోడ్ లో గల కార్య సిద్ది వినాయక స్వామి గుడి ప్రాణగంలో ఈ రోజు PMC మున్సిపల్ సిబ్బంది అన్యాయంగా అక్రమంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా JCBతో దేవాలయం కూల్చివేస్తున్నారని .హిందూ కార్యకర్తలు ప్రశ్నించగా రోడ్డు విస్తరణ కోసం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దేవాలయం కూల్చకుండా ఆపివేయాలి అని అడగడం కోసం కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. దేవాలయ అక్రమ కూల్చివేతపై హిందూ సంఘాల కార్యకర్తలు అందరూ కలిసి స్థానికంగా ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్యలో పిర్జాదిగూడ మున్సిపాలిటీలో ఎక్కువగా హిందూ దేవాలయాల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయల మీద జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేస్తామని హిందూ పరిషత్ సంఘాలు హేచ్చరించారు.




