మిల్లర్ల మెడపై డిపాజిట్ భారం.

- Advertisement -

మిల్లర్ల మెడపై డిపాజిట్ భారం.

Deposit burden on millers neck.

ఒకరు తప్పు చేస్తే అందరూ చేసినట్లేనా ?

మిల్లులు నడపడం కష్టంగా మారిందని ఆవేదన.
వరంగల్ ప్రతినిధి.

తెలంగాణ ప్రభుత్వం మిల్లర్ల మెడపై డిపాజిట్ భారాన్ని మోపిందని జిల్లాలోని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కొందరు మిల్లు యజమానులు చేసిన తప్పుకు అందరు బాధ్యత వహించవలసిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. వరంగల్ హనుమకొండ జిల్లాలలో సుమారు 160 రైస్ మిల్లులు ఉన్నాయి. వీరిలో కొందరు రైస్ మిల్లు నడపడం కష్టంగా మారిందని గత రెండు మూడు సంవత్సరాలుగా ఖరీఫ్ రబి సీజన్లో వరి ధాన్యాన్ని తీసుకోవడం లేదు. ఈ రెండు జిల్లాలలో ఉన్న మిల్లర్లు తప్పనిసరిగా ఖరీఫ్ పరిధాన్యాన్ని తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలన్న రీతిలో జిల్లా అధికారులు ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో చేసేది ఏమీ లేక అధికారుల ఒత్తిడి మేరకు జిల్లాల్లో ఉండబడిన కొందరు రైస్ మిల్లర్లు ముందుకు వచ్చి ప్రభుత్వ ఇచ్చిన టార్గెట్ మేరకు పరిధాన్యాలు సేకరించి బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు .ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది రైస్ మిల్లర్ల యజమానులు ముందస్తుగా బ్యాంకులలో డిపాజిట్ చేయాలని తీసుకోవచ్చారు. అలాంటి మిల్లులకు పరిధాన్యాన్ని దిగుమతి చేసే ఏర్పాటు చేసినట్లు అధికారులు మిల్లర్లు తెలిపారు. దీని కారణంగా మిల్లులను నిర్వహణ కష్టంగా మారిందని మిల్లర్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల మానసికంగా ఆర్థికంగా భారం పడి నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అనుమకొండ జిల్లాలో 60 రైస్ మిల్లులు ఉండగా 37 మంది రైస్ మిల్లు యజమానులు బ్యాంకులలో నగదు డిపాజిట్ చేసినట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో పరిధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.  జిల్లాలోని 15 మండలాలలో ఐకెపి కేంద్రాల ద్వారా జిల్లా అధికారులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రోజువారిగా ధాన్యం సేకరణకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో 11 మండలాలు ఉండగా ఆ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఎక్కువగా నర్సంపేట డివిజన్లో రైతులు వరి పంటను పండిస్తారు. ఆ డివిజన్లో వరి కోతల సీజన్ ప్రారంభం కాకపోవడంతో వరి ధాన్యం సేకరణ వేగం అందుకోలేకపోయింది.అయినప్పటికీ హనుమకొండ జిల్లాలో రైతులు ఐకెపి కేంద్రాల వద్ద  పైగాపులు కాయవలసిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు ఉండటం లేదని రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

డిపాజిట్ తో మిల్లర్లపై భారం.

గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైస్ మిల్లర్లపై డిపాజిట్ భారాన్ని మోపిందని మిల్లర్లు అనుకుంటున్నారు. హనుమకొండ జిల్లాలో 60 రైస్ మిల్లులు ఉండగా 37 రైస్ మిల్లర్ల యజమానులు అధికారుల ఒత్తిడి కారణంగా బ్యాంకులలో లక్షల రూపాయలను డిపాజిట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. డిపాజిట్ చేయనట్లయితే వరి ధాన్యాన్ని మిల్లులకు పంపేది లేదని అధికారులు తమపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకువచ్చారని అంటున్నారు. డిపాజిట్ ఏర్పాటుతోపాటు మిల్లుల నిర్వహణ గతంతో పోల్చుకుంటే భారంగా మారిందని, ఈ స్థితిలో ప్రభుత్వం మిల్లర్లను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ మేరకు బియ్యం దిగుమతి కావడం లేదని దాంతో మిల్లర్లపై కూలి కూలిన విధంగా భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి క్వింటాల్ వరి ధాన్యానికి 67 కిలోల బియ్యం రావడం కష్టంగా మారిందన్నారు.

ఒకరు తప్పు చేస్తే అందరు చేసినట్లేనా  ?

గతంలో రైస్ మిల్లర్లు యజమానులు కొందరు ప్రభుత్వానికి డిఎన్యు అందివ్వకుండా చేసిన తప్పుకు జిల్లాలోని అందరు రైస్ మిల్లర్లు బాధ్యులు కావలసిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని అధికారులు అందరి మిల్లు యజమానులపై భారం మోపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని సివిల్ సప్లై అధికారులు ఎఫ్సీఐ అధికారులు సంబంధిత రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు మిల్లర్లకు పంపిస్తున్న వరి ధాన్యాన్ని పంపిస్తున్న విధంగానే బియ్యాన్ని ఎగుమతి చేసుకోవాలని  కోరుతున్నారు. దాన్యంలో వచ్చిన చిన్న చిన్న సమస్యల కారణంగా మొత్తం బియ్యాన్ని ఎగుమతి చేసుకోకపోవడం వల్ల మిల్లర్లపై కోలుకోలేని భారం పడుతుందని తెలిపారు. దీని కారణంగా లక్షలాది రూపాయల భారం మిల్లర్లపై పడుతుందన్నారు పడుతుందన్నారు.

మిల్లుల నిర్వహణ కష్టంగా మారిందని ఆవేదన.

తెలంగాణలో రైస్ మిల్లుల నిర్వహణ కష్టంగా మారిందని అనకొండ జిల్లాలోని మిల్లర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం మిల్లర్లపై డిపాజిట్ భారాన్ని మోపి మానసికంగా ఆర్థికంగా ఇబ్బందుల గురిచేస్తుందని వారు ఆపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పిల్లర్ యజమానుల కష్టాలను పట్టించుకోవడంలేదని ఆందోళన చెందుతున్నారు. మిల్లుల నిర్వహణ ఈ స్థితిలో గతంలో ఎన్నడు లేని విధంగా తయారైందని అంటున్నారు. మిల్లర్లకు తెలంగాణ  ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సక్రమంగా అందించినట్లయితే భారం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని మిల్లర్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular