- Advertisement -
డిప్యూటీ సీఎంకు ఫీవర్
Deputy CM has feverతిరుపతి, అక్టోబరు 3, (వాయిస్ టుడే)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెల్త్ ఎలావుంది? ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు? ఆయన తేరుకునేందుకు మరో రెండురోజులు పడుతుందా? అలాగైతే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ లేనట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన తిరుమలలోని అతిథి గృహంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరో రెండు, మూడు రోజులు ఎక్కడికీ కదలడానికి వీల్లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. దీంతో రెండురోజులపాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్తం దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. బుధవారం శ్రీవారి సన్నిధిలో దీక్ష విరమించారాయన. కూతుళ్లతో కలిసి తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లినప్పుడే లైట్‌గా జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నడుకుంటూ తిరుమలకు వెళ్లారు. రాత్రి విపరీతమైన నొప్పులతో హై ఫీవర్ వచ్చిందని సమాచారం.దీంతో డాక్టర్ల టీమ్ అక్కడికి వెళ్లి ఆయనకు పరీక్షలు నిర్వహించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిలో జనసేన వారాహి డిక్లరేషన్ సభకు శ్రీకారం చుట్టూరు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతీ ఒక్కరూ ఈ సభకు తరలి రావాలని పిలుపు నిచ్చారు.జ్వరంతో బాధపడుతున్న పవన్.. ఈ సభకు హాజరుకావడం కష్టమేనని కొందరు నేతలు చెబుతున్నమాట. కచ్చితంగా వస్తారని మరికొందరు అంటున్నారు. దీంతో వారాహి సభ ఉంటుందా లేదా అనేదానిపై సందిగ్ధంలో పడ్డారు జన సైనికులు.
- Advertisement -




