- Advertisement -
గుంటూరు డిప్యూటీ మేయర్ అరెస్టు
Deputy Mayor of Guntur arrestedగుంటూరు
గుంటూరు డిప్యూటీ మేయర్, వైకాపా నేత నేత డైమండ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభిపురం స్టేషన్ పరిధిలో ఇంటి స్థల వివాదం విషయంలో…. డైమండ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ
మేయర్ పదవిని అడ్డుపెట్టుకుని…. విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు డైమండ్ బాబు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులతో డైమండ్ బాబు వాగ్వాదానికి దిగారు.
వారితో దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత పోలీసులు…వాహనంలో ఎక్కించుకుని…స్టేషన్ కి తరలించారు
- Advertisement -




