మేడ్చల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మండలం లోని అద్రాస్ పల్లి, ఉద్దేమర్రి, కేశవపూర్, లింగాపూర్ తండా, పోతారాం, నారాయణ పూర్,అనంతరం గ్రామాలలో ర్యాలీ (రోడ్ షో ) ప్రచార సభ లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. శామీర్ పేట్ మండలం బొమ్మరాసి పేట్ గ్రామంలో కు ప్రచారం చేయడం చేసారు.
అయనకు గ్రామస్తులు గజమాల తో స్వాగతం పలికారు. గ్రామాలలో మంగళహరుతులతో మహిళాలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళాలు యువకులు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.
మంత్రి మాట్లాడుతూ గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచింది. కేసిఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందని అన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామని అన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తాము. ఇప్పటికే సొంత నిధులతో నియోజకవర్గం లోని గ్రామాలలో రోడ్లు వేయించాను.గుడులు, మస్జీద్ లు కట్టివడం జరిగింది. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నానని అయన అన్నారు. .