అభివృద్ధి నా ఎజెండా …. సంక్షేమం నా అభిమతం..
సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా
పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తాం..
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి
జగిత్యాల,
అభివృద్ధి నా ఎజెండా…. సంక్షేమం నా అభిమతం.. అభివృద్ధి, సంక్షేమం కోసం రాజీ పడేది లేదని, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.. శుక్రవారం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్ లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 5వ వార్డు కౌన్సిలర్ గుగ్గిల్ల హరీష్ తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ
పట్టణ సమగ్రాభివృద్ధే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ అన్నారు.
అన్ని రంగాల్లో జగిత్యాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తుమని దీనికి ప్రజలు మద్దతు నివ్వాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ గా పోటీ చేస్తున్ననని దీనికి ప్రజల ఆశీర్వాదం కావాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగిత్యాల పట్టణాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేశామని అసలు జగిత్యాల అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీ అని చెబుతూ పార్టీ అధికారంలోకి రాగానే తై బజార్ పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గృహ లక్ష్మి పథకం కింద
బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మంజూరు పత్రాలు మాత్రమే ఇచిందని, కానీ ఆ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అమలు చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని రాబోయే ఎంపీ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
ఉద్యోగాలు ఇవ్వకుండా దేశ యువతను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమౌతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆనంతరం
జగిత్యాల
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్ మాట్లాడుతూ
పట్టణ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాలలో అభివృద్ధి పనులను త్వరలోనే చేపడతామని అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ నినాదమని చైర్పర్సన్ జ్యోతి అన్నారు.
ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని, ప్రతీ వార్డులో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డులుగా తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చైర్పర్సన్
అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, బండ శంకర్, కొత్త మోహన్ ,అడెపు సత్యం, తదితరులు పాల్గొన్నారు.