బీజేపీ బిగ్ ఆఫర్… లైట్ తీసుకున్న విజయ్

- Advertisement -

బీజేపీ బిగ్ ఆఫర్… లైట్ తీసుకున్న విజయ్
చెన్నై, మార్చి 16, (వాయిస్ టుడే)

BJP’s Big Offer… Vijay Takes It Lightly
మిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు విజయ్‌ను తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ .. చివరిగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విజయ్‌కు బిజెపి అధిష్టానం బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీవీకేకు 80 అసెంబ్లీ సీట్లతో పాటు, ఎన్నికల అనంతరం విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు కూడా బిజెపి ప్రతిపాదించినట్లు సమాచారం.అయితే, బిజెపి ఇచ్చిన ఈ భారీ ఆఫర్ పట్ల విజయ్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన పార్టీ సిద్ధాంతాలకు, బిజెపి భావజాలానికి పొంతన లేదని భావిస్తున్న విజయ్, ప్రస్తుతం ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు బీజేపీ ఈ ఆఫర్ విజయకు పంపింది. జాతీయ పార్టీతో చేతులు కలిపితే తన పార్టీ మూలాలకే ముప్పు వస్తుందని విజయ్ పొత్తు ఆలోచనలు అసలు పెట్టుకోలేదని తెలుస్తోంది. చాలా ఒత్తిడి వచ్చినప్పటికీ విజయ్ తగ్గడం లేదు.రాష్ట్రంలో డీఎంకే వంటి బలమైన శక్తిని ఎదుర్కోవాలంటే విజయ్ వంటి ప్రజాకర్షణ ఉన్న నాయకుడి మద్దతు అవసరమని బిజెపి భావిస్తోంది. అందుకే గత కొంతకాలంగా విజయ్‌తో సంప్రదింపులు జరుపుతోంది. 80 సీట్లు ఇవ్వడం ద్వారా కూటమిలో టీవీకేను కీలక భాగస్వామిని చేయాలని బిజెపి యోచించినా, విజయ్ మాత్రం తన రాజకీయ స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. బిజెపి ఆఫర్ చేసిన డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.విజయ్ నిర్ణయంతో తమిళనాడులో త్రిముఖ పోటీ ఖాయమని అర్థమవుతోంది. డీఎంకే నేతృత్వంలోని కూటమి ఒకవైపు, ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమి మరోవైపు ఉండగా.. విజయ్ తన టీవీకే పార్టీతో మూడవ శక్తిగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బిజెపి ఆఫర్‌ను తిరస్కరించడం ద్వారా తాను ఎవరికీ బి-టీమ్ కాదని, స్వతంత్రంగా ప్రజల తీర్పును కోరుకుంటున్నానని విజయ్ స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. ఈ పరిణామం రాబోయే ఎన్నికల్లో ఓట్ల చీలికకు దారితీస్తుందా లేదా విజయ్ కింగ్‌మేకర్‌గా మారుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular