సునీల్ రెడ్డి సమక్షంలో సామల అశోక్ బిజెపిలో చేరిక
మంథని: మంథని నియోజకవర్గంలో ఈసారి రాజకీయ మార్పు ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బిజెపి అసెంబ్లీ అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.
శనివారం మంథని పట్టణంలోని పద్మశాలి వీధికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సామల అశోక్ తన అనుచరులతో కలసి బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీ లో చేరారు. వీరికి సునీల్ రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో రాజకీయ మార్పు ద్వారానే నిరుపేదల బ్రతుకులలో వెలుగులు నిండుతాయని ప్రజలలో దృడ విశ్వాసం తోటే బిజెపి పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. మంథని అభివృద్ధి కేవలం బిజెపి పార్టీ తోటే సాధ్యమని నమ్మి బీజేపీ పార్టీలో ప్రజలు స్వచ్ఛందంగా భారీగా చేరుతున్నారని అన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి రాజకీయ మార్పు కోరుకొని ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మంథని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను అని అన్నారు. అధికార పార్టీ బి ఆర్ ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని పెట్టే ప్రలోభాలకు లోను కావద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మంథని పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి,అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడ్ల సాగర్ కోశాధికారి పార్వతి విష్ణు, సీనియర్ నాయకులు కొరబోయిన మల్లికార్జున్, మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు షరీఫుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.