బొజ్జనకొండకు ఆధ్యా త్మిక శోభ
అనకాపల్లి సమీపంలో ఉన్న బొజ్జన కొండ కు త్వరలోనే అంత ర్జాతీయ ఖ్యాతి లభించనుందని టీటీ డీ మాజీ చైర్మన్, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆ ర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి తీసుకువచ్చిన సుమారు 7.30 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో బొజ్జనకొండ అభివృద్ధిలో భాగంగా ఆ ప్రదేశంలో ధ్యాన మందిరానికి వైసిపి ఉత్త రాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వీ. సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్,ఎంపీ బీసెట్టి సత్యవతి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడు తూ బొజ్జనకొండ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అనకాప ల్లి చరిత్రలో శుభదినము అని అన్నారు.జిల్లాల విభ జన నేప థ్యంలో అనకాపల్లిని జిల్లాగా చేసి దీని అభి వృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్య త ఇస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన బొజ్జనకొండ మరింత ఆధ్యా త్మిక శోభనం సం తరించుకుంటే అనకా పల్లి ప్రాముఖ్యత కూడా పెరు గుతుం దని ఆయన అన్నారు. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు ఈ బొజ్జనకొం డ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తున్నారని, త్వర లోనే విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు కూడా ఈ ప్రాంతానికి వస్తే బొజ్జనకొండకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని సుబ్బారెడ్డి అభిప్రాయ పడ్డారు.



