Thursday, May 21, 2026

భావితరాలకు ఉపయోగపడే విధంగా మంథని అభివృద్ధి శ్రీధర్ బాబు తోనే సాధ్యం

- Advertisement -

భావితరాలకు ఉపయోగపడే విధంగా మంథని అభివృద్ధి శ్రీధర్ బాబు తోనే సాధ్యం

Development of Manthani in way that will be useful for future generations is possible only with Sridhar Babu

-ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

మంథని

భావితరాలకు ఉపయోగపడే విధంగా మంథని నియోజకవర్గంలో అభివృద్ధి అనేది రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోనే సాధ్యమవుతుందని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. మంగళవారం మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో మంథని,కాళేశ్వరం బస్టాండ్ల విస్తరణ కొరకు 4 కోట్ల 90లక్షల నిధులు మంజూరు చేయించిన  రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,ఎస్సి సెల్  డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ లు మాట్లాడుతూ  రానున్న రోజులలో జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా మంథని బస్టాండ్ ని 95 లక్షల రూపాయలతో అత్యధిక హంగులతో విస్తరణ చేయడానికి,కాళేశ్వరం బస్టాండ్ ని ఆధునిక హంగులతో 3.95కోట్ల రూపాయలతో నిర్మించడానికి మంత్రి శ్రీధర్ బాబు ఆర్టీసీ బోర్డు యాజమాన్యంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడం జరిగిందని వారికి మంథని ప్రజల తరఫున  ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.దూర ప్రాంతాల నుండి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు ఎక్కువ మొత్తంలో వెళ్తుండడంతో అలాగే రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద మొత్తంలో అభివృద్ధి అనేది చేయడం జరుగుతుందని తెలిపారు.
మా నాయకులు సింగపూర్, దావూస్ పర్యటనలో ఉన్నా కూడా మంథని ప్రాంతానికి మంచి రవాణా సౌకర్యం కల్పించాలని ఉద్దేశం తోటి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు.ప్రతి ఒక్క పనిని ఏ సమయంలో ఏం చేయాలో మంత్రి శ్రీధర్ బాబు కు తెలుసునని అన్నారు. కొద్ది రోజులలో రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా వంటి మరి కొన్ని పథకాలను ప్రజలకు అందుతాయని, ప్రజలు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోకూడదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఇది ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలొ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్లు వికె రవి, నక్క నాగేంద్ర, చోప్పకట్ల హనుమంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి శంకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల కమల్,బీసీ సెల్ జిల్లా కార్యదర్శి మంథని సురేష్ ,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు అర్థం సదానందం,ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు అర్ల నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు దొరగొర్ల శ్రీనివాస్,సేమంతుల ఓదెలు, ఎరుకల మధు, సీనియర్ నాయకులు పెరవెన లింగయ్య, అజీమ్ ఖాన్, లైసెట్టి రాజు,నరెడ్ల కిరణ్,కొయ్యల మొండి, దేవేందర్,రోడ్డ రాజేశ్వర్,కొంతం శ్రీను,గుండా రాజు, కావటి సమ్మయ్య,తీగల సమ్మయ్య, ఎండి అంకుష్, రామకృష్ణ, అలీమ్ ఖాన్, ఐసన్,పొనగంటి రమేష్,అక్కపక సది, నితీష్,ఎరుకల రమేష్ బాబు,సురేష్,చంద్రు విజయ్,ఎరుకల  నిరంజన్,రాజు,కొరవెన కుమార్, పొరాండ్ల రంజిత్,బూడిద రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్