- Advertisement -
గ్రామాల అభివృద్దె నా లక్ష్యం..వోడితల ప్రణవ్ బాబు….
Development of villages is my aim..Voditala Pranav Babu....
ప్రతి గ్రామానికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు
హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్..
జమ్మికుంట
హుజరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి నా లక్ష్యమని, ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్, అన్నారు జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో గల ఆంజనేయ స్వామి కి మకర తోరణం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ గా ఇక్కడి ఆంజనేయస్వామి దర్శనము చేసుకొని ప్రచారం ప్రారంభించడం జరిగిందని, నాగారం గ్రామంలో గల ఆంజనేయస్వామి చాలా పవర్ ఫుల్ దేవుడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడటంతో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంటలు బాగా పండాలని కోరుకుంటున్నానని , అదేవిధంగా వావిలాల, నగురం, నాగారం, పాపక్కపల్లి గ్రామాలతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు చేరేలా చేస్తానని హామీ ఇచ్చారు.
- Advertisement -