కార్పొరేటర్ హమీద్ పటేల్ .
కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లోని 10వ వీధిలో 28 లక్షలు అంచనా వ్యయంతో చేపట్టిన నూతన అంతర్గత రోడ్లు పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హామీద్ పటేల్ ఈ రోజు విచ్చేసి పర్యవేక్షించారు. అనంతరం మిసభా ఉల్ ఖురాన్ హష్మీయా మదర్శకు వెళ్లి కావాల్సిన సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. అందులో చదువుతున్న పిల్లలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి బస్తీ, ప్రతి కాలనీలలో మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేస్తూ, అభివృద్ధి పనులను చేబడుతుందని అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలో ప్రతి బస్తీ, కాలనీలలో దాదాపుగా 80 శాతం రోడ్లు పూర్తి చేశామని, మిగిలిన 20 శాతం రోడ్లు పూర్తి చేసి, కొండాపూర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చి దిద్దుతామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు. హమీద్ పటేల్ గారితో బాటుగా అయూబ్ భాయ్, మొహ్మద్ అలీ, తాడేం మహేందర్, సయ్యద్ ఉస్మాన్, సంజీవ, అజ్జు, చాంద్, హషం పటేల్, సలీం తదితరులు ఉన్నారు.



