పార్టీలకు, కులాలకు అతీతంగా మున్నూరు కాపు,రెడ్డి సంఘం స్మశానవాటికలో అభివృద్ధి పనులు:-
ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి
Development works in Munnuru Kapu, Reddy community cemetery across parties and castes

*మున్నూరు కాపు, రెడ్డి శ్మశాన వాటికను రూ.1.50 కోట్లతో అభివృద్ధి *ఉప్పల్లో మున్నూరు కాపు,రెడ్డి, స్మశాన వాటిక కమాన్ ను కీర్తిశేషులు నయాబ్ హనుమంతరావు పేరుతో ఉన్న కమాన్ ను ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభిస్తున్న దృశ్యం. ఉప్పల్ (వాయిస్ టుడే ప్రతినిధి):- ఉప్పల్ డివిజన్ లో రాజకీయాలకు, కులాలకు అతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్లోని మున్నూరు కాపు, రెడ్డి స్మశాన వాటికను రెండు విడతల్లో రూ. కోటిన్నర నిధులతో అభివృద్ధి చేసినట్టుగా తెలిపారు.ఇదే తరహాలో డివిజన్లోని మిగతా స్మశాన వాటికలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిల్లో కావలసిన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్టుగా చెప్పారు. *మున్నూరు కాపు రెడ్డి సంఘాల స్మశాన వాటిక కమాన్ ను ప్రారంభించిన రజిత పరమేశ్వర్ రెడ్డి* ఉప్పల్ కు చెందిన కీర్తిశేషులు నయాబ్ హనుమంతు పేరున వారి కుమారుడు నయాబ్ వెంకటేష్ వారి తండ్రి జ్ఞాపకార్థం కమాన్ ను నిర్మించారు. దీనిని శనివారం కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ ప్రారంభించారు. *ఉప్పల్ కార్పొరేటర్ మంద ముల్ల రజిత కు ఘన సత్కారం* ఉప్పల్లోని లక్ష్మారెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్లో శనివారం ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డికి పలు కాలనీలవాసులు,మున్నూరు కాపు, రెడ్డి,స్మశాన వాటిక ప్రతినిధులు ఘనంగా ఆమెకు శాలువాతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మున్నూరు కాపు,రెడ్డి స్మశాన వాటిక అభివృద్ధికి మొదటి విడతగా రూ.కోటి 5 లక్షలు, రెండో విడతలో రూ.45 లక్షల నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేశామన్నారు. పలువురు ఆయా సంఘాల ముఖ్యులు మాట్లాడుతూ ఉప్పల్ మున్నూరు కాపు,రెడ్డి కులస్తుల స్మశాన వాటిక అభివృద్ధి కోసం అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసినందులకు శ్మశాన వాటిక ప్రతినిధులు ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. *ప్రజలే నా కుటుంబం.. మీరంతా నా కుటుంబ సభ్యులే… మీ ఆడబిడ్డగా మీ ముందుకు మరోసారి వస్తా… మీ ఆశీర్వాదమే నాకు శ్రీరామరక్ష ..* ప్రజా సేవ చేసేందుకు తాను మీ వెంట ఉంటానని, ఎల్లప్పుడూ మీ సేవ చేసేందుకే నేను వెనుకాడనని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మా వారు పరమేశ్వర్ రెడ్డి, అధిక నిధులు తీసుకొచ్చి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాడని, మీకు ఎలాంటి సమస్య ఉన్న తనకు తెలియపరిచితే వెంటనే సమస్యల పరిష్కారం కోసం” మీ ఆడబిడ్డగా “కృషి చేస్తానన్నారు. ఇక ఏలాంటి పెండింగ్ పనులు ఉన్నా, నేనే దగ్గర ఉండి పనులు చేస్తానని, మీరంతా మా బంధువులు, ప్రజలంతా మా కుటుంబ సభ్యులేనని, మరొకసారి మీ “ఆడబిడ్డగా “నేనే మరొకసారి కార్పొరేటర్ గా ఎన్నిక అవుతానని మీ ఆశీర్వాదాలు నాకు, మావారు పరమేశ్వరెడ్డికి ఎల్లప్పుడూ ఉండాలని, ఉంటాయని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆమె ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి,మున్నూరు కాపు స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు దుబ్బ నర్సింహా రెడ్డి,మేకల హనుమంత్ రెడ్డి,మేకల వెంకట్ రామ్ రెడ్డి, శామీర్పేట్ ధర్మా రెడ్డి,మేకల మధుసూదన్ రెడ్డి,గోనె అర్జున్ రెడ్డి,గోనె ప్రభాకర్ రెడ్డి,వాకిటి బుచ్చి రెడ్డి,బాకారం లక్ష్మణ్,సల్ల ప్రభాకర్ రెడ్డి,లింగంపల్లి రామకృష్ణ,తుమ్మల దేవిరెడ్డి,అంజిరెడ్డి,నాగిరెడ్డి,నాయబు లక్ష్మమ్మ,నాయబు వెంకటేష్,ఉల్చ రాజు, సుక్క చంద్రమోహన్, రోకట్ రామ్, మండవ శ్రీశైలం,ఉల్చ మల్లేష్, గోవర్ధన్,ఐలేష్,తుమ్మల రాజేందర్ రెడ్డి, ఆయా పార్టీల నాయకులు ఏసురు యాదగిరి,ఈగ సంతోష్,మస్కా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.