బొజ్జగణపయ్యను భక్తిశ్రద్ధలతో కొలిచిన భక్తులు

- Advertisement -

బొజ్జగణపయ్యను భక్తిశ్రద్ధలతో కొలిచిన భక్తులు

Devotees worshipped Lord Ganesha with devotion and reverence.

Devotees worshipped Lord Ganesha with devotion and reverence.
Devotees worshipped Lord Ganesha with devotion and reverence.

శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 14 (వాయిస్ టుడే): శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టీఎంవీ కండిగలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సభ్యుడు, రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల తొంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితిని కేవలం పూజలు, వేడుకలకే పరిమితం చేయకుండా, వినాయకుడి బోధనలను జీవితంలో ఆచరించాలని సూచించారు. దేవుడు కేవలం విగ్రహ రూపంలోనే కాకుండా మన అంతరాత్మకు అద్దంలా ఉంటాడన్నారు. సమాజంలో మానవత్వం తగ్గిపోతూ, స్వార్థం పెరిగిపోతున్న పరిస్థితుల్లో వినాయకుడి రూపం మనకు ఎన్నో సందేశాలను అందిస్తోందని పేర్కొన్నారు.

వినాయకుడి పెద్ద చెవులు ఇతరుల మాటలను శ్రద్ధగా వినాలని, చిన్న నోరు అతిగా మాట్లాడకుండా ఉండాలని సూచిస్తున్నాయని అన్నారు. ఏకాగ్రత, బుద్ధి, విచక్షణను కోల్పోయి దురాశతో పరుగులు పెట్టకూడదని తెలిపారు.

దేవుడి పేరుతో పందిర్లు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించిన అనంతరం తోటి మనిషిని మోసం చేస్తే ఆ భక్తికి అర్థం ఉండదన్నారు. భక్తి కేవలం ఆచారంగా మిగిలిపోకుండా, మనసులో నుంచి వచ్చే మంచి కర్మగా మారాలని సూచించారు.

వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడేనని, అయితే మన బుద్ధిలోని కల్మషాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత మనదేనని బాలాజీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకుని, ధర్మబద్ధంగా జీవిస్తూ తోటి మనిషిని గౌరవించాలని పిలుపునిచ్చారు.

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, బాలాజీ, సుబ్బారావు, రమేష్, విక్కీ, గోపీ, మంచు తదితర భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular