ధరణిని ప్రక్షాళన చేస్తాం
మంత్రి పొంగులేటి
ఖమ్మం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను లోపాలను బయట పెడతాం. ఆనాటి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారు అనేది అధికారుల నుండి అడిగి తెలుసుకున్నాను. ఈ 6 పథకాలు ఇంటింటికి చేరుతాయని నమ్మి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ ను గెలిపించారు. గత ప్రభుత్వం లో చెందిన తప్పులకు ఏ అధికారులు ఎవరు బాధ్యులో తెలుసుకుంటాం. దానికి బాధ్యులైన అధికారులు మీద తీసుకునే చర్యలు తప్పవు. స్వేచ్ఛగా ఉండే ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. చిత్త శుద్ధితో పనిచేసే అధికారులను కీ పోజిషన్ లో ఉంచుతామని అన్నారు.
గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు అధికారుల మీద రుద్దారు.
కక్ష్య సాధింపు చర్యలు ఏ అధికారుల మీద ఉండవు. ఎవరు ప్రభుత్వ ఆస్తులు కొల్ల గొట్టారో వాటిని సమీక్షించాం. అధికారం ఉంది అని బినామీ కాంట్రాక్ట్ లకు ఇస్తే వాటిని సరి చేసుకోమని అధికారులకు చెప్పడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం నాయకులు ఇంకా అధికారం లో ఉన్నాం అనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు ప్రతి దానిని గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. 20 తారీఖు న జరిగే అసెంబ్లీ లో వైట్ పేపర్ ను రిలీజ్ చేస్తాం. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేశాం. ఇంకా మిగిలిన నాలుగు పథకాలు సంక్రాంతి కల్లా పూర్తి చేస్తామని అన్నారు.
ఆరు గ్యారంటీ లను ప్రజలకు చేరవేయడమే మన ముందున్న లక్ష్యం. మీరు ఖజానాను దోచుకొని కాళీ తాళం చేతులు మాకు ఇచ్చారు. విడతల వారీగా ప్రతి పేదవారికి ఇళ్లు ఉండే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. కారు కూతలు కూయవద్దని ప్రతి పక్షాల వారిని కోరుతున్నా. ఇరిగేషన్ లో అవినీతి జరిగింది.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతాం. ధరణి పేరుతో జరిగిన అవినీతి నీ బయట పెడతం. ధరణిని ప్రక్షాళన చేస్తామని అన్నారు.
ధరణిని ప్రక్షాళన చేస్తాం
- Advertisement -
- Advertisement -