Sunday, September 8, 2024

అవినీతి కుటుంబ పాలన అంతం బిజెపి లక్ష్యం ధర్మపురి అరవింద్

- Advertisement -

అవినీతి కుటుంబ పాలన అంతం బిజెపి లక్ష్యం ధర్మపురి అరవింద్

పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీలో చేరిన యువత

వాయిస్ టుడే : ఇబ్రహీంపట్నం ప్రతినిధి నవంబర్ :14

కోరుట్ల నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండలంలోని సత్తెకపల్లి ఎర్రపూర్ డబ్బా వర్షకొండ కోమటి కొండాపూర్ గ్రామాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచార యాత్రలో పాల్గొన్న ఆయా గ్రామ ప్రజలు మహిళలు ఇట్టి కార్యక్రమంలో ఎంపి అరవింద్ మాట్లాడుతూ టిఆర్ఎస్ చేసిన మోసాలను ఎండగాడుతూ మహిళలకు పింఛన్ రాదని ఎవరైనా వచ్చి అంటే చీపిరి వట్టి కొట్టమని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా మీ పెన్షన్ రావడం ఆగిపోదని చెప్పారు. బిజెపి ప్రభుత్వానికి గెలిపిస్తే ఇంకా అదనంగా పెన్షన్ ఇస్తామని తెలిపారు. రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ ఒక చేత పదివేలు ఇస్తూ మరో చేత 12 వేల లక్కుంటున్నాడని రైతులకు తెలియజేశారు. రైతులారా ఇకనైనా మోసపోకుండా ఆలోచించండి అని అన్నారు. పసుపు బోర్డు తెప్పించింది నేనేనని షుగర్ పార్టీ తెరిపించేది బిజెపి ప్రభుత్వమేనని తనను గెలిపించిన వెంటనే షుగర్ పార్టీ తెరిపిస్తానని హామీ ఇచ్చినారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వెంటనే రైతులకు పసుపు రేటు 15 నుండి 20 వేల వరకు పెరుగుతుందని అన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో లాగా మోసపూరిత రాజకీయాలు మేము చేయమని బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అదే చేసి చూపిస్తుందని అన్నారు. మీకు డబల్ బెడ్ రూంలో అందరికీ వచ్చినాయని అడిగారు. ప్రజలు మాకు రాలేదని సమాధానం చెప్పడం జరిగింది కేంద్రంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో కలిపి నాలుగు కోట్ల ఇండ్లు కట్టించడం జరిగిందని తెలిపారు.భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండలం కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ ప్రచారం లో భాగంగా ఎర్రపూర్, డబ్బా,వర్షకొండ కోమటి కొండాపూర్ గ్రామాల్లో రోడ్ షో బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంటు కో కన్వీనర్ గుంటూక సదాశివ్ ఇబ్రహీంపట్నం మాజీ జడ్పీటీసీ జంగిలి సునీత దేవి, తెలు ముత్తన్న, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ జె యన్ వెంకట్ ఆయ గ్రామాల బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జిలు పాల్గొన్నారు, బిజెపి అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ అవినీతి లేని ప్రభుత్వం రావడం కోసం కుటుంబ పాలన అంతం కావాడానికి బిజెపి కి ఓటు వెసి ఆత్యదిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో మోడీ నీతి నిజాయతి పరిపాలన నచ్చి ఎర్రపూర్ గ్రామం నుండి భుక్య రాజు నాయక్ మాజీ సర్పంచ్ బీమా నారక్ మాజీ ఉప సర్పంచ్ యం గంగారమ్ వార్డు మెంబరు గంగారమ్ మధు సంతోష్ దేవాదాస్ రమేష్ సంజీవ్ మరియు డబ్బా గ్రామంలో సత్యం గౌడ్ నవీన్ వినోద్ గంగారెడ్డి పురుషోత్తం మదు విశాల్ శేఖర్ ఉదయ్ గణేష్ వర్షకోండి గ్రామంలో బాలకృష్ణ హృతిక్ అశోక్ విజయ్ నవీన్ హర్ష శ్రీకాంత్ మనోజ్ ప్రసాద్ శైలెష్ సురేష్ ప్రవీణ్ రాజు శ్రీను సుమన్ సుమంత్ సత్తీష్ మహేష్ శివ మందుల విష్ణు ప్రశాంత్ దశ కుమార్ రణధీర్ లక్ష్మణ్ సంపత్ 200 మంది నాయకులు యువకులు ఇతర పార్టీల నుండి బీజేపీ లో చేరడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్