ట్రంప్ తో ధోని  గోల్ఫ్‌

- Advertisement -

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ తో మహేంద్రసింగ్ ధోని గేమ్

Dhoni golf with Trump
Dhoni golf with Trump

న్యూ జెర్సీ :సెప్టెంబర్ 08:  భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ధోని ఇటీవల అమెరికాకు చేరుకున్నాడు. అల్కరాజ్‌ను కలిసిన, మ్యాచ్‌ చూస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ట్రంప్ న్యూజెర్సీ బెడ్‌మిన్‌స్టర్‌లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో గోల్ఫ్ ఆడేందుకు భారత మాజీ కెప్టెన్‌ను ఆహ్వానించారు.

Dhoni golf with Trump
Dhoni golf with Trump

ఈ సందర్భంగా ట్రంప్‌తో కలిసి మహి గోల్ఫ్‌ను ఆస్వాదించాడు. ధోని వెంట దుబాయికి చెందిన వ్యాపారవేత సంఘ్వీ సైతం ఉన్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అమెరికా మాజీ ప్రెసిడెంట్‌తో ధోనీ గోల్ఫ్‌ ఆడిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular