కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఎల్బి స్టేడియంలో బిసి ఆత్మగౌరవ సభ పెడుతున్నారు. ఎన్నికల ముందు మీకు బీసీలు గుర్తొచ్చారా లని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ప్రశ్నించారు. ఓబిసి ఎంపీ కన్వీనర్ గా బిసి ల కోసం కాంగ్రెస్ ఎంతో చేసింది. ఐఐటి, ఐఐఎం లో రిజర్వేషన్లు కావాలని కోర్టుకు వెళ్తే .అవకాశం లేదని సుప్రీం కోర్టు చెప్పింది. సొనియా గాంధీ ని కలిసి న్యాయం చేయాలని పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కోరాం.. ఈరోజు వేలాది సంఖ్యలో డాక్టర్లు చదువుతున్నారంటే కాంగ్రెస్ కారణం. క్రిమిలేయర్ వల్ల కూడా వాళ్ళకే లాభం జరుగుతుంది. క్రిమిలేయర్ ఎత్తేయాలని ఎంపీలం కోరం. రాహుల్ గాంధి భారత్ జోడొయాత్ర తరువాత ఒబీసీ ల సమస్యలు తెలిసాయి. ఓబిసి కుల గణన చేయడానికి అంగీకరించారు .హామీ ఇచ్చారు. ఇప్పుడు మోడీ కి బిసిల ఆత్మగౌరవం గుర్తొచ్చిందా. ఆంధ్ర కి ప్రత్యేక హోదా కావాలని అడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ పక్కన చేరారు. పవన్ కళ్యాణ్ ని బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు. బిసి ల గురించి చెప్తున్న పవన్ కళ్యాణ్ కాపు కి చెందిన వారు. ప్రైవేట్ ఇండస్ట్రీలలో రిజర్వేషన్స్ ఎందుకు అడగలేదు. మోడీ ఓబిసి లకు మోసాన్ని గమనించాలి. కాంగ్రెస్ ఒక్కటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని అన్నారు. మీజీ ఎంపి పొన్నా ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ బిసి ల ఆత్మగౌరవ సమావేశానికి మోడీ హాజరవుతున్నారు.. మీకు బిసి ల మీద ప్రేమ ఉంటే కుల గణన ని ఎందుకు అంగీకరించడం లేదు. మోడీ ,కేసీఆర్ ఇద్దరు బిసి లకు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ సమగ్ర సర్వే రిపోర్ట్ బయటపెట్టాలి. బీఆరెస్ లో బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించే పరిస్థితి ఉందా. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. మా ప్రభుత్వం రాగానే కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఓబిసి జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ఏడాది కాలంగా ఎందుకు బిసి సమావేశం పెట్టలేదు. .బిసి ల పై బీజేపీ మోసలి కన్నీరు కారుస్తుంది. బీజేపీ కుల గణన ని ఎందుకు వ్యతిరేకించిందో స్పష్టత ఇవ్వాలి. బిసి లకు ఎక్కువ స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది… ఇప్పటికి 23 ఇచ్చింది. భవిష్యత్ లో మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. ..