- Advertisement -
సూర్యాపేట జిల్లాలో విషాదం
ట్రాక్టర్ డ్రైవర్ కు మూర్చ..ఇద్దరు మృతి
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అర్వపల్లి మండలం, పరసాయిపల్లి గ్రామంలో రామలింగయ్య అనే ట్రాక్టర్ డ్రైవర్ పొలం దున్నుతుండగా.. ఫిట్స్ తో డ్రైవర్ సీట్లోనే మృతి చెందాడు. అదే సమయంలో.. పొలం గట్టు మీదున్న మల్లయ్య అనే రైతు మీదకి ఫుల్ వీల్ తో ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా దూసుకెళ్లడంతో.. మల్లయ్య అనే రైతు సైతం మృతి చెందాడు. దీంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -


