Tuesday, April 29, 2025

ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూ సేకరణకు ఆదేశాలు

- Advertisement -

ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూ సేకరణకు ఆదేశాలు,
అలైన్మెంట్లో మార్పులకు రేవంత్ రెడ్డి సూచన

Directions for land acquisition of southern part of RRR

హైదరాబాద్, ఆగస్టు 21
రీజినల్ రింగు రోడ్డు  పనుల్లో పురోగతిపై  కలెక్టర్లు ఏం చేస్తున్నారు, రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూ సేకరణ, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తనకు అందజేయాలని రేవంత్ సూచించారు. ఆర్ఆర్ఆర్ ప్రగతిపై రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణ, పనులకు సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు తెలిపారు. భూ సేకరణ వేగం పెరగాలని, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలోని విషయంలో రోజు వారీగా ఏం చేశారు, ఏం పురోగతి సాధించారో ప్రతి రోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలపాలని ఆదేశించారు. దక్షిణ భాగంలో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం, ఇతర విషయాలపై సైతం కలెక్టర్లు ప్రతి రోజు సీఎస్ కు వివరాలు అందజేయాలన్నారు. భూ సేకరణ పారదర్శకంగా జరగాలన్నారు. సీఎస్తో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలపై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒక సమీక్షకు తరువాతి సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పనుల్లో పురోగతి తప్పనిసరిగా ఉండాలని  ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి- ఆమన్గల్- షాద్ నగర్- చౌటుప్పల్ (మొత్తం 189.20 కి.మీ.) మార్గానికి సంబంధించి భూ సేకరణ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. RRR ఉత్తర భాగంలో ఇప్పటికే భూ సేకరణ చాలా వరకు పూర్తయిందన్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో రోడ్డు విషయంలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్రంతో చర్చించి, పనుల విషయంలో ముందుకు సాగాలని రేవంత్ సూచించారు. ఆర్ఆర్ఆర్ మొత్తం మ్యాప్ను గూగుల్ మ్యాప్ లో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా అలైన్మెంట్ ఉండాలన్నారు. తాను సూచించిన మార్పులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించి,  అందజేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా అధికారులకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణానికి ముందే ఎక్కడెక్కడ అవి ప్రధాన రోడ్లకు అనుసంధానం కావాల్నారు. సిగ్నల్, ఇతర సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు. రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్ (ORR), ఆర్ఆర్ఆర్ ల అనుసంధానానికి అనువుగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుకానున్న పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు
ఇతర సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు. రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్ (ORR), ఆర్ఆర్ఆర్ ల అనుసంధానానికి అనువుగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుకానున్న పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్