స్వరాష్ట్రలోనూ స్థానిక పత్రికలపై వివక్ష
Discrimination against local newspapers in Swarashtra too
స్థానిక పత్రికలకు
అండగా ఉంటాం…
భారత శక్తి క్యాలెండర్
ఆవిష్కరణ కార్యక్రమంలో..
డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
తాడూరు కరుణాకర్
కరీంనగర్, ఫిబ్రవరి, 04
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్థానిక పత్రికలు
దిక్సూచిలా పనిచేశాయని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా
రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ తెలిపారు.
మంగళవారం కరీంనగర్ డబ్ల్యూజేఐ కార్యాలయంలో
భారత శక్తి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన
ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
రాష్ట్ర ఏర్పాటు కల సాకారం అయినప్పటికీ, స్థానిక పత్రికల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
సమాచార శాఖలో గుర్తింపు కోసం, రేట్ కార్డు కోసం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రేట్ కార్డు పెంపుదల కోసం స్థానిక పత్రికల యాజమాన్యాలు కళ్ళు కాయలు కాచేలా చూడాల్సిన పరిస్థితి
నెలకొని ఉందన్నారు.
స్థానిక పత్రికలకు బాసటగా నిలిచేందుకు, వారి సమస్యలపై ప్రభుత్వంతో ప్రాతినిధ్యం జరిపేందుకు డబ్ల్యూజేఐ సిద్ధంగా ఉందన్నారు. స్థానిక పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోని స్థానిక పత్రికలకు డబ్ల్యూజెఐ మాత్రమే
అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆందోళనలకు సిద్ధమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారత శక్తి కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్, డబ్ల్యూజేఐ నాయకుడు దారం జగన్నాథ రెడ్డి, ప్రజా తీర్పు ఎడిటర్ ఎస్. మల్లేష్ రెడ్డి, వుదయం దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ గంగం.రాజు, అరుణ కిరణాలు స్టాఫ్ రిపోర్టర్ ఆడెపు లక్ష్మినారాయణ, అక్షరం ఎడిటర్ కొండ్ర విజయ శంకర్, కందెన స్టాఫ్ రిపోర్టర్ దుస్స.గౌరీశంకర్, తెలంగాణ తేజ ఎడిటర్ మొగురం రమేష్, జర్నలిస్టు న్యూస్ పేపర్ జిల్లా ప్రతినిధి టి. నాగరాజు, బతుకమ్మ టివి విడియో జర్నలిస్టు సుమ తదితరులు పాల్గొన్నారు.