Sunday, September 8, 2024

పవన్ సలహాలపై చర్చ

- Advertisement -

పవన్ సలహాలపై చర్చ
గుంటూరు, జూన్ 13,
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్..వెండితెరపై జనసేనానికి ఉన్న పేరు ఇది. అయితే ఇప్పుడా హీరోను రియల్‌ హీరో చేశారు ప్రజలు. తన చేతికి నిజమైన పవర్‌ను అందించారు. మరి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పవన్ తన పవర్‌ను ఎలా ఉపయోగించబోతున్నారు. పగలు, ప్రతికార రాజకీయాలకు కేరాఫ్‌ అయిన ఏపీ పాలిటిక్స్‌లో.. పవన్ మార్పు తీసుకొస్తారా? దీనికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటి?ఒకసారి చేస్తే తప్పు.. పదే పదే జరిగితే అది అలవాటు.. రాజకీయాల్లో ఇదే జరుగుతుంది అంటారు. వాళ్లు కాకపోతే వీళ్లు.. వీళ్లు కాకపోతే ఇంకొకరు. పాలించేవారు మారుతారు. బట్ పాలించే విధానం మాత్రం మారదు. ఇదే ఏపీ పాలిటిక్స్‌ గురించి కాస్త తెలిసిన వారు ఎవరైనా చెప్పే మాట.. కానీ ఇకపై అలా ఎవ్వరూ అనుకునే అవకాశం ఇవ్వొద్దు అంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రజలకు నిజమైన పాలన అంటే ఏమిటో పరిచయం చేద్దామంటున్నారు. అధికారాన్ని కక్షసాధింపుల కోసం కాకుండా.. ప్రజాభివృద్ధి కోసం వాడండి అంటూ చెబుతున్నారు. తాను అదే ఫాలో అవుతానని.. మీరు కూడా అదే ఫాలో అవ్వండి అంటూ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.ఏపీలో ఎన్డీఏ కూటమిది అఖండ విజయం.. అందులో జనసేనది అత్యద్భుత విజయం..పోటీ చేసిన 21 సీట్లలో 21 సీట్లను కైవసం చేసుకుంది. సో ఈ గెలుపును ప్రజలకు మనపై ఉన్న నమ్మకంగా చూడాలి. అంతేకాని గెలిపించారు కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే కుదరదు అంటున్నారు పవన్.. మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. ఇతరులు చేసిన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇదే చేస్తానంటున్నారు పవన్.. ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు. అధికారాన్ని ఇవ్వడమూ తెలుసు. ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేయకపోతే..ఆ అధికారాన్ని లాక్కోవడం కూడా తెలుసు. వైసీపీ అధినేత జగన్ విషయంలో అదే జరిగింది. మరి ఈ తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే ఎలా? అంటున్నారు పవన్.నిజానికి పవన్ మాట్లాడేది చాలా బాగుంది. ఇది ఆచరణలో జరిగితే అంతకంటే బాగుంటుంది. నిజంగానే ఏపీ పాలిటిక్స్‌లో మాత్రమే కాదు. నేషనల్ పాలిటిక్స్‌లో ఓ కొత్త ట్రెండ్‌ను పవన్ ప్రారంభించినట్టే.. కానీ పవన్ మాటలు ఆచరణలో సాధ్యమవుతుందా? అంటే అవుతుంది.. బట్ ఆయన ఎమ్మెల్యేలు ఫాలో అవుతారా? లేదా? అనేదే క్వశ్చన్.. ఎమ్మెల్యేలంతా ఆచరణలో దీన్ని చూపిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద మార్పు మొదలైనట్లే.కానీ ఒకటి మాత్రం నిజం.. పవన్‌ ఆవేశంగా కాదు.. ఆలోచనతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. వైసీపీ వ్యతిరేక అజెండాతో కాదు.. ప్రజాభివృద్ధే ఎజెండాగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. మనం కూటమిలో ఉన్నాం కాబట్టి.. కాబట్టి సర్దుకుపోవాల్సి ఉంటుందని ముందుగానే సూచిస్తున్నారు. సో నేల విడిచి సాము చేసే ఉద్దేశం ఆయనలో కనిపించడం లేదు. సంతోషం.. ఆయన థాట్స్ క్లియర్‌గానే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఆయనను ఫాలో అయ్యేవారు కూడా ఇదే బాటలో నడిస్తే మంచిది. లేదంటే.. డైలాగ్స్‌ను డైలాగ్స్‌లానే ఉండిపోతాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్