- Advertisement -
శిశు సంరక్షణసంస్థల్లోని పిల్లలకు ధృవీకరణ పత్రాల పంపిణీ
Distribution of certificates to children in childcare institutions
పాల్గోన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్
శిశు సంరక్షణ సంస్థలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధ్రువీకరణ (సర్టిఫికెట్లను) పత్రాలను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పంపిణీ చేసారు. 50 శిశు సంరక్షణ కేంద్రాల్లో 2300 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఈరోజు 1330 మందికి వివిధ రకాల సర్టిఫికెట్ లు ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, కార్పొరేటర్ విజయారెడ్డి , యూనిసెఫ్ ప్రతినిదులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్ శిశుకేంద్రాల్లో సంరక్షణ పొందుతున్న 1330 మందికి పైగా వివిధ రకాల గుర్తింపు , విద్యాపరమైన ,వారి కుల ,నివాస , ఆధార్ తదితర సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులకు అభినందనలు. సర్టిఫికెట్ పొందుతున్న వారికి భవిష్యత్ లో అంతా మంచే జరగాలని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఉపాధి ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఇప్పుడున్న 50 శిశు విహార్ కేంద్రాల్లో 6 ప్రభుత్వం నడుపుతుంది. మిగతావాటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఇలాంటి ప్రక్రియ దేశంలో ఎక్కడ జరగడం లేదు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాకుండా కాస్మోపాలిటన్ సిటీ అన్ని రకాల ప్రాంత ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇటువంటి వ్యవస్థ లో ఉన్న వారికి ఆధారాలు ఉండలని జిల్లా యంత్రాంగం ప్రతిష్టగా తీసుకుందని అన్నారు.
గుర్తింపు మనిషి ఐడెండిటీ మనం భవిష్యత్ లో బయటకు వెళ్ళినప్పుడు ఇది చాలా అవసరం. ఆ సర్టిఫికెట్ ద్వారా మీకు వచ్చే కోటాలో అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నా. మీరు మంచిగా చదువుకొని కాంపిటేటివ్ స్పిరిట్ లో ముందుకు పోవాలి. ప్రభుత్వం అండగా ఉంటుంది. సమాజంలో నాకెందుకు అనుకోకూడదు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి.. రోడ్డు భద్రత పై అవగాహన కల్పిస్తున్నాయి. అర్ఫాన్స్ విషయంలో ప్రజా పాలన ప్రభుత్వం మంత్రులు అధికారులు సానుకూలంగా ఉందని అన్నారు.
- Advertisement -