- Advertisement -
రాయితీపై శనగ విత్తనాల పంపిణీ
Distribution of gram seeds on concessionసి.బెళగల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రబీ సీజన్ కి సంబంధించి రాయితీపై శనగ విత్తనాలు మండలంలోని రైతు సేవ కేంద్రాలకు చేరుకున్నాయని సి.బెళగల్ మండల వ్యవసాయ అధికారి జి.మల్లేష్ కుమార్ తెలిపారు. అనంతరం శనగ విత్తనాలు ఒక క్వింటం పూర్తి ధర 9400/-రూపాయలు, ప్రభుత్వము 25% సబ్సిడీతో రైతులకు ఒక క్వింటం 7050/- రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క ఒక శనగ సంచి 20 కేజీల చొప్పున ఉంటుంది, ఒక శనగ సంచి ధర 1410/-రూపాయలు ఉంటుందని వ్యవసాయ అధికారి తెలిపారు. అదేవిధంగా రబీ సీజన్లో సాగు చేయవలసిన రైతులు తమ గ్రామంలోని రైతు సేవ కేంద్ర ఇన్చార్జిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి.మల్లేష్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
- Advertisement -




