ఉద్యోగులకు మట్టి గణపతుల పంపిణీ

- Advertisement -

ఉద్యోగులకు మట్టి గణపతుల పంపిణీ

Distribution of soil ganpatis to employees

కరీంనగర్
కరీంనగర్ కలెక్టరేట్లో సిబ్బందికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మట్టితో తయారుచేసిన గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలు నీటిలో కరగకపోవడం వల్ల  నీటి కాలుష్యం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, మెప్మా పీడీ స్వరూపారాణి పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular