పలు పనులను పర్యవేక్షించిన జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ

- Advertisement -

మంథని మున్సిపాలిటీలో పలు పనులను పర్యవేక్షించిన జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ
మంథని

District Additional Collector Arunashree supervised many works :

మంథని మున్సిపాలిటీలో పలు పనులను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ శుక్రవారం పర్యవేక్షించారు. మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తో కలసి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మున్సిపల్ పరిధిలోని  1వ వార్డు శ్రీపాద కాలనీలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రజలతో కాసేపు ముచ్చటించి పలు విషయాలను సేకరించారు. పారిశుద్ధ్య నిర్వహణ గురించి స్థానిక కౌన్సిలర్ గుండా విజయలక్ష్మి పాపారావు ని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా మున్సిపల్ పరిధి లోని డంపింగ్ యార్డ్ ని పరిశీలించి పాత డంప్ యార్డ్ ని మట్టి తో చదును చేసి చికెన్ వ్యర్థాలను ప్రత్యేకంగా డంప్ చేయాలి అని ఆదేశాలు జారి చేశారు. కొత్త  డంప్ యార్డ్  కోసం ఎక్లాస్పూర్ గ్రామ శివారు లోని ప్రభుత్వ స్థలాన్ని, రచ్చపల్లి లోనీ ప్రభుత్వ స్థలాన్ని ఆమె పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, వార్డు కౌన్సిలర్ వికె రవి తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular